ఈ వారం facebook లో 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో Madhav Rao Koruprolu గారి గజల్ కి నా పెన్సిల్ చిత్రం.
చెలి బుగ్గల సిగ్గులలో అనురాగపు గనులున్నవి..!
తన పెదవుల అరుణిమలో నవ పగడపు సిరులున్నవి..!
తారలతో ముచ్చటించు ఆ మౌనమె నా కోవెల..!
మంచుపూల తలపులో తన పరువపు వనులున్నవి..!
మంచుపూల తలపులో తన పరువపు వనులున్నవి..!
కడలి అలల పదములకే సరిగమలను నేర్పునుగా..!
తన చూపుల స్వరములలో మధుమాసపు మరులున్నవి..!
తన చూపుల స్వరములలో మధుమాసపు మరులున్నవి..!
అడుగడుగున కలహంసల సొగసులొలుకు నెరజాణరొ..!
కాంతిపూల ధారలలో తన సరసపు నిధులున్నవి..!
కాంతిపూల ధారలలో తన సరసపు నిధులున్నవి..!
పలుకు వీణ శృతిలయలకు ప్రాణమూదు ప్రేమమయిరొ..!
తన అందెల రవములలో శుభ చెలువపు సరులున్నవి..!
తన అందెల రవములలో శుభ చెలువపు సరులున్నవి..!
నా'మాధవ' ప్రియ భామిని ఆ'రాధ'యె ఆమె సుమా..!
ఆ వలపుల పిలుపులలో చిలపితనపు గిరులున్నవి..!
ఆ వలపుల పిలుపులలో చిలపితనపు గిరులున్నవి..!
3 కామెంట్‌లు:
చెంపకు సాయము చేతిని
నింపుగ నుంచెను జిలేబి నిచ్చట జూడన్
సొంపగు రూపము నయనపు
వొంపుల విరుపున పెదవులు వోరగ జూచెన్ !
జిలేబి
బాగుందండి మీ పద్యం. ధన్యవాదాలు
A picture speaks 1000 words అంటారు. 1000 భావనలు కనిపిస్తున్నాయి. తెలుగమ్మాయి.. అద్భుతం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి