5, సెప్టెంబర్ 2016, సోమవారం

వినాయకుడు - colour pencil work -


నేడు వినాయక చవితి. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మూడు సంవత్సరాల క్రితం రంగు పెన్సిళ్ళతో రూపొందించిన చిత్రం.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు ఓసారి మననం చేసుకుందాం.

ఎలుకగుర్రము మీద నీరేడు భువనాల పరువెత్తి వచ్చిన పందెకాడు 
ముల్లోకములనేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు.
“నల్లమామా” యనుచు నారాయణుని పరియాచకా లాడు మేనల్లు కుర్ర 
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోముపంట !
అమరులం దగ్రతాంబూల మందు మేటి ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వ్యాహ్యాళి వెడలివచ్చె ఆంధ్రవిద్యార్ది ! లెమ్ము జోహారులిడగ !!
లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు పసుపుగోచీకే సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు గరికపూజకే తలకాయ నొగ్గు
పంచాకల్యాణికై యల్కపాన్పు లేదు ఎలుక లత్తడికే బుజాలెగుర వైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు పచ్చి వడపప్పె తిను “వట్టి పిచ్చితండ్రి” !

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల 
ఇడుములం దించి కలుము లందించు చేయి; 
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి: 
భారతబిడ్డల భాగ్యాలు దిద్దుగాక !
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...