31, అక్టోబర్ 2016, సోమవారం

యస్.డి. బర్మన్ - SD Burman - పెన్సిల్ చిత్రం



భారత దేశం గర్వించ దగ్గ అత్యద్భుత సంగీత కారులలో ఒకరు సచిన్ దేవ్ బర్మన్. ఈ రోజు బర్మన్ దా వర్ధంతి. ఈ సందర్భంగా నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. ఆ మహా సంగీతకారునికి ఇదే నా నివాళి.

30, అక్టోబర్ 2016, ఆదివారం

కన్నులు - కవిత (గజల్)


శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి గజల్ - నా పెన్సిల్ చిత్రం.

చెప్పకపోయినా మనసున ఉన్నది వింటవి కన్నులు
స్వామికి కావడి నీబాగునకై మోస్తవి కన్నులు
నేనూ నీవూ ఒకటేకాదా ఎప్పటి నుంచో
నారూపాన్నే నీకన్నులలో చూస్తవి కన్నులు
జాబిలి వెన్నెల వేరుగచూడగ వీలవుతుందా
నీచిరునవ్వుల ప్రేమపత్రమే రాస్తవి కన్నులు
ఇరువురి మధ్యన దూరం ఎరుగను కలహమునైనా
నీదగు తలపుల బరువుకు కిందకు వాల్తవి కన్నులు!
హృదయపు కోవెల వెలసిన దైవం 
నీవే కావా
చూపులతోనే పూజలు నిరతం చేస్తవి కన్నులు!
నాతిచరామని చేసినబాసలు మరువక రారా
తోరణమైమనవాకిట నీకై ఉంటవికన్నులు !
ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల – 28.10.16


సూర్యకాంతం - Suryakantham


28, అక్టోబర్ 2016, శుక్రవారం

అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు,
యెన్నరాదు మా బలగ మెంచుకో మాపౌజు
.
౧. జ్ఞానేంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియములైదు
తానకపు కామక్రోధాల వర్గములారు
ఈ నెలవు పంచభూతాలెంచు మాపౌజు.
౨. తప్పని గుణాలు మూడు తను వికారములారు
అప్పటి మనోబుధ్యహంకారాలు,
ఉప్పతిల్లు విషయము లుడివోని ఒక అయిదు
ఇప్పటి మించే కోపము యెంచుకో మాపౌజు.
౩. ఆఁకలి దప్పియును మానావమానములును
సోకిన శీతొష్ణాలు సుఖదుఃఖాలు
మూక గమికాడ నేను మొక్కెద శ్రీ వేంకతేశ !
యేకటార గడపేవా నెంచుకో మాపౌజు.
భావం .. దేవా! అన్నీ నీలొనే నిక్షిప్తమై ఉన్న శ్రీపతివి నీవు. సమస్తమునకు అధిపతివి. కానీ మా సైనిక బలగమేమీ తక్కువగా లేదు సుమా! ఇది లెక్కకు మించి యున్నది. మరి మా బలగాన్ని చూచి కాచుకో మరి.
శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అను జ్ఞానేంద్రియము లైదు మాలో నున్నవి. వాక్కు, వాణి, పాదము, పాయువు, ఉపస్థము అను అయిదు కర్మేంద్రియములు శరీరమునకు సంబంధించి యున్నవి. అట్లే మోహరించి నిలిచిన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను అరిషడ్వర్గములు ఉన్నవి. మరియు పృథివ్యప్తేజో వాయవాకాశములను పంచభూతాలును కలవు. మా సేన ఎట్లున్నదో పరీక్షించుకో..
అట్లే సత్త్వము, రజస్సు, తమస్సు అను గుణములు మూడు; ఉండుట. పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షీణించుట. నశించుట అను శారీరకమైన వికారములు ఆరు. మనస్సు, బుధ్ధి, అహంకారము అనునవి మూడు, ఎప్పటికప్పుడు ఉత్పత్తి యగు శబ్ధము, స్పర్శము, రూపము, రసము, గంధము అను విషయములైదు మా సేనలో నున్నవి. అన్నిటికి మించిన కోపము కూడా ఉన్నది. ఇంత విశాలమైన దండుని అలక్ష్యము చేయకు.
ఇంతేకాదు, అకలిదప్పులు, మానావమానములు, శరీరమునంటిన శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలైన ద్వందములు కూడా కలవు. కాన నేను సామాన్యుడిని కాను. ఇంత గొప్ప సేనకు అధిపతిని. నా వెనుక ఇంత పెద్ద మూక ఉన్నది. శ్రీ వేంకటేశ్వరా! ఇదిగో నీకు మొక్కుచున్నాను. నాలో ఉన్న ఈ శతృ సైన్యాన్ని ఓడించి ఆపేక్షతొ నన్ను నడిపించు.
సద్గుణముల కంటె దుర్గుణములు ఎప్పుదూ బలమైనవే. ఈ దుర్గుణములను, బలహీనతలు అను శతృ సంహారము చేసి రక్షింపుమని ఆ వేంకటేశ్వరుని అన్నమయ్య ఈ కీర్తనలో వేడుకుంటున్నాడు.

26, అక్టోబర్ 2016, బుధవారం

తెలుగు అక్షరాలు


మరుగున పడిపోతున్నకొన్ని మన తెలుగు అక్షరాలు గురించి శ్రీమతి Bhavani Ssa గారు facebook లో పెట్టిన  ఓ టపా నన్ను ఆకర్షించింది. వారికి నా బ్లాగు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా చదవండి.
మనం మరచిపోయిన తెలుగు
అరసున్న [ ( ], బండి ‘ ఱ ‘లు ఎందుకు? – అరసున్న, బండి ‘ ఱ ‘లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న, ఱ ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది.
పదసంపదకి ఇవి తోడ్పడతాయి.
ఎలాగో చూడండి:
అరుఁగు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏఁడు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కాఁపు = కులము
కాపు = కావలి
కాఁచు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీఁకు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱుఁగు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దాఁక = వరకు
దాక = కుండ, పాత్ర
నాఁడు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పేఁట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పోఁగు = దారము పోఁగు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బోఁటి = వంటి [నీబోఁ టి]
వాఁ డి = వాఁడిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడుఁగు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.

సురయ్య - అలనాటి మేటి హిందీ నటి - పెన్సిల్ చిత్రం


నా పెన్సిల్ గీతల్లో అలనాటి మధుర గాయని, హిందీ నటి 'సురయ్య' 

25, అక్టోబర్ 2016, మంగళవారం

ఎన్టీఆర్ - పౌరాణిక పాత్రలు


facebook లో తారసపడిన ఓ post.
పౌరాణిక పాత్రలకు తెలుగు నేలనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్టీఆర్ పేరుగాంచారు. ప్రముఖ సినీ దర్శకుడు, అద్భుత చిత్రాల సృష్టికర్త వి. శాంతారాం ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రం చేయాలని ఉవ్విళ్ళూరారు. కానీ ఎన్టీఆర్ తెలుగు చిత్రాలు తప్ప వేరే చిత్రాలు చేయననడంతో శాంతారాం కోరిక నెరవేరలేదు.
ఎన్టీఆర్ విలక్షణ ఆలోచనాధోరణికి నిదర్శనం సీతారామ కళ్యాణం చిత్రం. తన స్వంత చిత్రంలో 
ఏరికోరి ప్రతినాయక పాత్రను ధరించి, రావణ పాత్రకు హీరో ఇమేజ్ తెచ్చిపెట్టారు ఎన్టీఆర్. ఆయనకు రావణ పాత్ర అంటే అమితమైన ఇష్టం. ఒకసారి ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ''నాకతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదల కలవాడుగా కనిపిస్తాడు. తొలిసారి భూకైలాస్ చిత్రంలో రావణపాత్ర ధరించినప్పటి నుంచి నాకు అదో విశిష్టపాత్రగా అనిపించింది. రావణ అనగానే సామాన్య దృష్టికి రావణుడు కోపిష్టి , క్రూరుడు అయిన రాక్షసుడుగా కన్పిస్తాడు. కానీ రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్ధం చేసుకున్నా మనకు తోచే ఆకృతి వేరు. శ్రీమహవిష్ణువే అతని అంతానికి అవతారమెత్తవలసి వచ్చిందంటే ఆయనెంత దురంధరుడో ఊహించుకోవచ్చు. అలాంటి పాత్ర్ర ధరించాలని నాఅభిలాష. అదే నన్ను రావణ పాత్రధారణకు ప్రోత్సహించింది.'' అన్నారు ఎన్టీఆర్.
సీతా స్వయంవరాన్ని అపహాస్యం చేసేందుకు జంగమదేవర రూపంలో వచ్చిన రావణుడి చిత్రం ఇది.

(శాంతారామ్ గారు శకుంతల దుష్యంతుల కధ ని 'స్త్రీ' అనే పేరుతో హిందీలో నిర్మించారు. ఈ చిత్రంలో దుష్యంతుడు పాత్ర పోషించమని ఎన్టీఆర్ ని అడిగారట. హిందీలో తన సంభాషణలు తానే చెప్పుకోలేనని, తనకు మరొకరు dubing చెప్పడం తనకు ఇష్టంలేదని నిరాకరించారట. చివరికి శాంతారామ్ గారు తానే ఆ పాత్రని పోషించారు. -- పొన్నాడ మూర్తి)

17, అక్టోబర్ 2016, సోమవారం

నీలి మేఘమా జాలి చూపుమా



ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట. ఇంత చక్కటి పాట ఎందుకనో మరుగున పడిపోయింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు, వాణీ జయరామ్ గారు అద్భుతంగా పాడారు. చిత్రంః అమ్మాయిల శపధం. సంగీతం విజయ్ భాస్కర్ గారు సమకూర్చారు. మీరూ విని ఆనందించండి.

14, అక్టోబర్ 2016, శుక్రవారం

బాలిక - పెన్సిల్ చిత్రం


 అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నా పెన్సిల్ రేఖలతో రూపు దిద్దుకున్న ఓ బాలిక.

నర్తనశాల






తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరం గా నిలిచిన చిత్రం 'నర్తనశాల'. ఈ చిత్ర విశేషాలు ఎన్నో, ఎన్నెన్నో. ఈ  రోజు facebook లో 'తెలుగు మధురగీతాలు' గ్రూప్ లో శ్రీ కామేశ్వరరావు అనప్పిండి గారి అద్భుత వ్యాసం చదివాను. బ్రుహన్నల గా 'ఎన్టీఆర్' నటన దాని వెనుక ఉన్న కృషి చాలా బాగా రాశారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. ఇంత మంచి వ్యాసం అందించినందుకు శ్రీ కామేశ్వరరావు గారికి నా ఈ బ్లాగు ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.



https://www.facebook.com/groups/1469531919951888/permalink/1772476359657441/

10, అక్టోబర్ 2016, సోమవారం

గురుదత్ - నటుడు, నిర్మాత, దర్శకుడు

ఈ రోజు అద్భుత చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు గురుదత్ వర్ధంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. గురుదత్ అసలు పేరు వసంత్కుమార్ శివశంకర్ పదుకొనె. 1950 , 1960 సం.లలో నిర్మించిన classics ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహెబ్ బీబి అవుర్ గులామ్ తదితర చిత్రాలు వీరిని ప్రపంచ స్థాయి లో నిలబెట్టాయి. Time magazine vaari ఆల్ టైమ్ అత్యుత్తమ వంద చిత్రాల జాబితాలో వీరు నిర్మించిన ప్యాసా, కాగజ్ కే ఫూల్ చేర్చబడ్డయి. వీరిని "India's Orson Welles" గా కూడా కొనియాడుతుంటారు. వీరికి నా పెన్సిల్ చిత్రం ద్వారా నివాళి.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...