30, అక్టోబర్ 2016, ఆదివారం

కన్నులు - కవిత (గజల్)


శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి గజల్ - నా పెన్సిల్ చిత్రం.

చెప్పకపోయినా మనసున ఉన్నది వింటవి కన్నులు
స్వామికి కావడి నీబాగునకై మోస్తవి కన్నులు
నేనూ నీవూ ఒకటేకాదా ఎప్పటి నుంచో
నారూపాన్నే నీకన్నులలో చూస్తవి కన్నులు
జాబిలి వెన్నెల వేరుగచూడగ వీలవుతుందా
నీచిరునవ్వుల ప్రేమపత్రమే రాస్తవి కన్నులు
ఇరువురి మధ్యన దూరం ఎరుగను కలహమునైనా
నీదగు తలపుల బరువుకు కిందకు వాల్తవి కన్నులు!
హృదయపు కోవెల వెలసిన దైవం 
నీవే కావా
చూపులతోనే పూజలు నిరతం చేస్తవి కన్నులు!
నాతిచరామని చేసినబాసలు మరువక రారా
తోరణమైమనవాకిట నీకై ఉంటవికన్నులు !
ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల – 28.10.16


కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...