25, అక్టోబర్ 2016, మంగళవారం

ఎన్టీఆర్ - పౌరాణిక పాత్రలు


facebook లో తారసపడిన ఓ post.
పౌరాణిక పాత్రలకు తెలుగు నేలనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్టీఆర్ పేరుగాంచారు. ప్రముఖ సినీ దర్శకుడు, అద్భుత చిత్రాల సృష్టికర్త వి. శాంతారాం ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రం చేయాలని ఉవ్విళ్ళూరారు. కానీ ఎన్టీఆర్ తెలుగు చిత్రాలు తప్ప వేరే చిత్రాలు చేయననడంతో శాంతారాం కోరిక నెరవేరలేదు.
ఎన్టీఆర్ విలక్షణ ఆలోచనాధోరణికి నిదర్శనం సీతారామ కళ్యాణం చిత్రం. తన స్వంత చిత్రంలో 
ఏరికోరి ప్రతినాయక పాత్రను ధరించి, రావణ పాత్రకు హీరో ఇమేజ్ తెచ్చిపెట్టారు ఎన్టీఆర్. ఆయనకు రావణ పాత్ర అంటే అమితమైన ఇష్టం. ఒకసారి ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ''నాకతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదల కలవాడుగా కనిపిస్తాడు. తొలిసారి భూకైలాస్ చిత్రంలో రావణపాత్ర ధరించినప్పటి నుంచి నాకు అదో విశిష్టపాత్రగా అనిపించింది. రావణ అనగానే సామాన్య దృష్టికి రావణుడు కోపిష్టి , క్రూరుడు అయిన రాక్షసుడుగా కన్పిస్తాడు. కానీ రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్ధం చేసుకున్నా మనకు తోచే ఆకృతి వేరు. శ్రీమహవిష్ణువే అతని అంతానికి అవతారమెత్తవలసి వచ్చిందంటే ఆయనెంత దురంధరుడో ఊహించుకోవచ్చు. అలాంటి పాత్ర్ర ధరించాలని నాఅభిలాష. అదే నన్ను రావణ పాత్రధారణకు ప్రోత్సహించింది.'' అన్నారు ఎన్టీఆర్.
సీతా స్వయంవరాన్ని అపహాస్యం చేసేందుకు జంగమదేవర రూపంలో వచ్చిన రావణుడి చిత్రం ఇది.

(శాంతారామ్ గారు శకుంతల దుష్యంతుల కధ ని 'స్త్రీ' అనే పేరుతో హిందీలో నిర్మించారు. ఈ చిత్రంలో దుష్యంతుడు పాత్ర పోషించమని ఎన్టీఆర్ ని అడిగారట. హిందీలో తన సంభాషణలు తానే చెప్పుకోలేనని, తనకు మరొకరు dubing చెప్పడం తనకు ఇష్టంలేదని నిరాకరించారట. చివరికి శాంతారామ్ గారు తానే ఆ పాత్రని పోషించారు. -- పొన్నాడ మూర్తి)

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...