28, ఫిబ్రవరి 2017, మంగళవారం

నీ నవ్వుల కిల కిలలే


నా బొమ్మకి శ్రీమతి Putcha Gayatri Devi గారి కవిత 
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
సరాగములు, సయ్యాటలు, శ్రుతిమించని తరంగాలు
నీవలపుల ప్రేమాటలు మధురిమలను పంచినవి
సురగంగల కదలి వచ్చే నా ప్రేమ ఝురి నీవే కదా !
నీ ఊసులు, ఊహలతో నా దినము గడచినది.
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
నా ఊహల నందనమా, కదలి వచ్చే వయ్యారమా !
వెన్నెలంటి చిరునవ్వుతో మెరిసే మణి హారమా !
వాదనలు, శోధనలు విధి రాసిన వింత రచన
ఈ నాటక రూపములో నా జీవన భాగ్యమా !
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
కరుణ పంచు నీ రూపే కరువు తీర కాంచిన,
సుధలు పంచు నీ పలుకే మదినిండుగా వినినా
సమ్మెహన పదానికే నీవే తాత్పర్యమా !!
కదలాడే చంద్రవంక నా ఊహా చిత్రమా !
పి. గాయత్రిదేవి.
Ponnada VR Murty గారి చిత్రము

27, ఫిబ్రవరి 2017, సోమవారం

రుక్మిణి అరుండేల్ - Pencil drawing

u
My pencil drawing to pay tribute to Rukmini Devi Arundale on her birth anniversary today. (29 February 1904 – 24 February 1986. She was an Indian theosophist, dancer and choreographer of the Indian classical dance form of Bharatnatyam, and an activist for animal rights and welfare.

Rukmini Devi features in India Today's list of '100 People Who Shaped India'. She was awarded the Padma Bhushan in 1956, and Sangeet Natak Akademi Fellowship in 1967.

ఈ క్రింది లింకు క్లిక్ చేసి వార్త దినపత్రికలో ఈమె గురించి వచ్చిన వార్త చదవండి.
http://www.sakshi.com/news/national/google-doodle-with-rukmini-devi-318639

18, ఫిబ్రవరి 2017, శనివారం

భానుమతీ రామకృష్ణ భాసమాన కళాతృష్ణ



2013 సం. లో నేను వేసిన పెన్సిల్ చిత్రానికి మిత్రులు Vanam Venkata Varaprasaad గారి కవితా స్పందన.
నుమతీ రామకృష్ణ భాసమాన కళాతృష్ణ
భేషజమా నైజమా బేహద్బీ యను ప్రశ్న
దరహాసపు శశి కళలకు మధుమాసపు రస పసలకు
కసి రుస బుస విసురులకు, ముసి నగవుల ముసురులకు,
గారపు సింగారపు బంగారపు చెలి కొసరులకు!
చిరునవ్వుల మల్లీశ్వరి చురకత్తుల చండీరాణి
ఎవరేమన్నా అననీ రాజీలేదను బాణీ!
ఓహోహో పావురమే! ఒకపరి వయ్యారమే!
పాటకు సరి ఎలకోకిల, ఆట వనమయూరమే!
కొందరికది ఠీవి మరికొందరికది దర్పం
భయపెట్టే అందం, కుబుసము వీడినదిది సర్పం!
ఇందరిలో యిద్దరికే, అందరికా రాచరికం?
ఒక మగాడు 'నందమూరి', ఈడ ఆడనందమూరి!
(మిత్రులు పొన్నాడ Pvr Murty వారి సౌజన్యముతో..వారి గీతకు నా కూత!)

15, ఫిబ్రవరి 2017, బుధవారం

ఏంచెప్పను - గజల్


నా చిత్రానికి 
Jyothi Kanchi
 గారి గజల్
॥ఏంచెప్పను॥
~~~~~~~~~~~~~
నాతోడుగ నీవుంటే ఆఉనికే ఎంతహాయి!!
నీనీడే నాదైతే ఆగెలుపే ఎంతహాయి!!
కన్నులపై ముత్యాలతొ కావ్యాలను రాసేవూ
ఆల్చిప్పల రెప్పలలో ఆకలలే ఎంతహాయి!!
హృదయవీణ తీగలపై కొనగోటితొ మీటేవూ
జావళీల కౌగిలిలో ఆస్పర్శే ఎంతహాయి!!
మధువనిలో భ్రమరములా తేనెచినుకు గ్రోలేవూ
పుప్పొడిలా పెదవులపై ఆరుచులే ఎంతహాయి!!
నీలిసిరుల నింగిలోని నెలరాజుగ తోచేవూ
వెన్నెలలో దోబూచులు ఆకధలే ఎంతహాయి!!
సుఖమైనా వెతలైనా చేయివదల నన్నావూ
వసంతమై చేరుకున్న ఆవలపే ఎంతహాయి!!
క్షణమాగని నీవూహలొ జ్యోతి పులకరిస్తోందీ
ఎంతంటే ఏంచెప్పను ఆతలపే ఎంతహాయి!!
JK 15-2-17 (చిత్రం-Pvr Murty బాబాయ్ గారు.
_/|\_ధన్యవాదాలు బాబాయ్ ..)

మిస్సమ్మ - ఓ చిన్న విశ్లేషణ





మిస్సమ్మ చిత్రానికి ఓ మంచి విశ్లేషణ ఇచ్చారు మిత్రులు చంద్రశేఖర్ కిలారి. ఈ లింక్ క్లిక్ చేసి మీరూ చదవండి.

https://www.facebook.com/photo.php?fbid=2227813834111226&set=a.1807828959443051.1073749033.100006478940076&type=3&theater&notif_t=like&notif_id=1487207381649293

8, ఫిబ్రవరి 2017, బుధవారం

హృదయ తరంగం - Pen sketch

My pen lines - కవిత courtesy Smt. Ponnada Lakshmi
ఎంతవరకు ఈ మనసు అంధకారాన్ని ఎదుర్కొంటుంది?
సమసిపోతుంది ఉదాసీనత ఎప్పుడో ఒకప్పుడు.
సుఖదుఃఖాలు వస్తూ పోతూంటాయి జీవిత సత్యాన్ని తెలుపుతూ.
ఆకురాలుకాలం కొద్దిరోజులు మాత్రమే
పూలవనం మళ్ళీ కళకళలాడుతుంది కొత్త చిగురులతో
ప్రచండ మారుతం వీచినా, అంతరంగంలో అగ్నిశిఖలు రగులుతున్నా
ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకొని అడుగు ముందుకు వెయ్యి
పడిలేచే కడలి తరంగాలు తీరాన్ని చేరుతూనే ఉంటాయి
.. పొన్నాడ లక్ష్మి

4, ఫిబ్రవరి 2017, శనివారం

Pencil sketch - గజల్ - బ్రతుకువీణపై ..



Pencil sketch - గజల్ courtesy Jyothi Kanchi
బ్రతుకువీణపై మీటాలంటే సహనపుసరిగమ అవసరమేగా!!
జీవనరాగమె పాడాలంటే ఓరిమిపదనిస అవసరమేగా!!
కష్టంవెనుకనె గట్టొకటుందని పెద్దలుచెప్పిన సుద్దులువినుకో
సుఖాలపానుపు చేరాలంటే బాధలబడలిక అవసరమేగా!!
సంద్రపునవ్వుల గవ్వలుఏరుతు ఆవలిఒడ్డుకు మార్గమెవెదుకూ
మదిలోమువ్వలు మోగాలంటే ప్రశాంతవీచిక అవసరమేగా
వేదన శోధన చక్రాలౌతూ జీవితజట్కా సాగేనెపుడూ
నేర్పుగనడుపుట తెలియాలంటే పగ్గంకదలిక అవసరమేగా!!
ఆశలపల్లకి మోసేతెరువరి కోర్కెలసమరమె ఆగదుఎపుడూ
భ్రమరపురెక్కలు ఆగాలంటే మధువులసుమలత అవసరమేగా!!
జీవితమెపుడూ గులాబి-ముళ్ళను సత్యమునిపుడే తెలిపెను 'జ్యోతీ'
వెన్నెలకాంతులు మెరవాలంటే చీకటివేదిక అవసరమేగా!!.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...