4, ఫిబ్రవరి 2017, శనివారం

Pencil sketch - గజల్ - బ్రతుకువీణపై ..



Pencil sketch - గజల్ courtesy Jyothi Kanchi
బ్రతుకువీణపై మీటాలంటే సహనపుసరిగమ అవసరమేగా!!
జీవనరాగమె పాడాలంటే ఓరిమిపదనిస అవసరమేగా!!
కష్టంవెనుకనె గట్టొకటుందని పెద్దలుచెప్పిన సుద్దులువినుకో
సుఖాలపానుపు చేరాలంటే బాధలబడలిక అవసరమేగా!!
సంద్రపునవ్వుల గవ్వలుఏరుతు ఆవలిఒడ్డుకు మార్గమెవెదుకూ
మదిలోమువ్వలు మోగాలంటే ప్రశాంతవీచిక అవసరమేగా
వేదన శోధన చక్రాలౌతూ జీవితజట్కా సాగేనెపుడూ
నేర్పుగనడుపుట తెలియాలంటే పగ్గంకదలిక అవసరమేగా!!
ఆశలపల్లకి మోసేతెరువరి కోర్కెలసమరమె ఆగదుఎపుడూ
భ్రమరపురెక్కలు ఆగాలంటే మధువులసుమలత అవసరమేగా!!
జీవితమెపుడూ గులాబి-ముళ్ళను సత్యమునిపుడే తెలిపెను 'జ్యోతీ'
వెన్నెలకాంతులు మెరవాలంటే చీకటివేదిక అవసరమేగా!!.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...