15, ఫిబ్రవరి 2017, బుధవారం

ఏంచెప్పను - గజల్


నా చిత్రానికి 
Jyothi Kanchi
 గారి గజల్
॥ఏంచెప్పను॥
~~~~~~~~~~~~~
నాతోడుగ నీవుంటే ఆఉనికే ఎంతహాయి!!
నీనీడే నాదైతే ఆగెలుపే ఎంతహాయి!!
కన్నులపై ముత్యాలతొ కావ్యాలను రాసేవూ
ఆల్చిప్పల రెప్పలలో ఆకలలే ఎంతహాయి!!
హృదయవీణ తీగలపై కొనగోటితొ మీటేవూ
జావళీల కౌగిలిలో ఆస్పర్శే ఎంతహాయి!!
మధువనిలో భ్రమరములా తేనెచినుకు గ్రోలేవూ
పుప్పొడిలా పెదవులపై ఆరుచులే ఎంతహాయి!!
నీలిసిరుల నింగిలోని నెలరాజుగ తోచేవూ
వెన్నెలలో దోబూచులు ఆకధలే ఎంతహాయి!!
సుఖమైనా వెతలైనా చేయివదల నన్నావూ
వసంతమై చేరుకున్న ఆవలపే ఎంతహాయి!!
క్షణమాగని నీవూహలొ జ్యోతి పులకరిస్తోందీ
ఎంతంటే ఏంచెప్పను ఆతలపే ఎంతహాయి!!
JK 15-2-17 (చిత్రం-Pvr Murty బాబాయ్ గారు.
_/|\_ధన్యవాదాలు బాబాయ్ ..)

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...