28, ఫిబ్రవరి 2017, మంగళవారం

నీ నవ్వుల కిల కిలలే


నా బొమ్మకి శ్రీమతి Putcha Gayatri Devi గారి కవిత 
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
సరాగములు, సయ్యాటలు, శ్రుతిమించని తరంగాలు
నీవలపుల ప్రేమాటలు మధురిమలను పంచినవి
సురగంగల కదలి వచ్చే నా ప్రేమ ఝురి నీవే కదా !
నీ ఊసులు, ఊహలతో నా దినము గడచినది.
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
నా ఊహల నందనమా, కదలి వచ్చే వయ్యారమా !
వెన్నెలంటి చిరునవ్వుతో మెరిసే మణి హారమా !
వాదనలు, శోధనలు విధి రాసిన వింత రచన
ఈ నాటక రూపములో నా జీవన భాగ్యమా !
నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి
నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.
కరుణ పంచు నీ రూపే కరువు తీర కాంచిన,
సుధలు పంచు నీ పలుకే మదినిండుగా వినినా
సమ్మెహన పదానికే నీవే తాత్పర్యమా !!
కదలాడే చంద్రవంక నా ఊహా చిత్రమా !
పి. గాయత్రిదేవి.
Ponnada VR Murty గారి చిత్రము

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...