సిగ సింగారం కొప్పు బంగారం
జుట్టున్నమ్మ ఎంత కొప్పైనా వేస్తుంది.. ఇది నాటి మాట. కొప్పు ఉన్నమ్మకి కోటి వయ్యారాలు ఇది సామెత..కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటారు. మంచి ఒతైన..పొడవైన జుట్టు వారు ఏ జడ అయినా వేసుకోవడానికి వీలుంటుంది. జుట్టులేనమ్మ కూడా తాను కోరిన కొప్పు వేసుకోవచ్చు.. ఇది నేటి మాట. వనితల జుట్టు పలచగా, కురచగా ఉన్నా తాము కోరిన కొప్పును వేసుకునే సౌలభ్యం లభిస్తోంది. కొప్పులు చుట్టుకోవడంలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన వాణిశ్రీని మళ్లీ మగువలు ఫాలో అవుతున్నారు. కొత్త కొత్త వెరైటీలతో నగర వనితా లోకం ఇప్పుడు కొప్పు చూడు కొప్పందం చూడు అంటోంది.కొప్పు ఉన్నమ్మకి కోటి వయ్యారాలు ఇది సామెత..కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటారు. మంచి ఒతైన..పొడవైన జుట్టు వారు ఏ జడ అయినా వేసుకోవడానికి వీలుంటుంది.
'మానవుడు దానవుడు' చిత్రంలో ఉషశ్రీ గారు కొప్పు గురించి ఎంత చక్కగా రాశారో చూడండి.
కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
మగడా నే మునుపటి వలెనే లేనా?
అహా! అలాగా!
కొప్పులో పూలెక్కడివే?.. నీ కొప్పులో పూలెక్కడివే?
అవా?
కట్టెల కోసమెళితే.. నే కట్టెల కోసమెళితే
కొమ్మ తగిలి కొప్పు నిండింది మావా
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా
మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి కవితా స్పందన ఎల ఉందో చూడండి.
నీలాల కురులు.
ఒద్దికగా సవరించి
నడినెత్తిపైకి తెచ్చి
చిన్నిపిలకను కట్టి
దోగాడుతుందొక బుజ్జి కృష్ణమ్మ
పుట్టు వెండ్రుకలిచ్చి
స్వామి మొక్కును తీర్చి
చలిమిడి ముద్దలా
చక్కనగు గుండుతో
పరిగెట్టు పసిపాప పసిడిబొమ్మ
ఆరుపాయలు తీసి
రెండు జడలుగ వేసి
ఆటపాటల గడిపి
చదువుసంధ్యల నెదుగు
పరువాల చిన్నారి కులుకుల కొమ్మ
బారు కురులను దువ్వి
వాలు జడగా అల్లి
నడుము ఒంపున నాగు
నాట్యమాడుతున్నట్లు
వయ్యార మొలికేను ముద్దుగుమ్మ
వెలుగు నీడలల్లె
తెలుపు నలుపుల తోటి
వయసుమీద పడెనను
వార్ధక్యమును చాటు
అందాల కురులను
అలవోకగా ముడిచి
పూలు సింగారించు
పుణ్యవతి బామ్మ
బుజ్జాయి,అమ్మాయి
అమ్మ, , బామ్మ
అన్ని వయసులవారికీ
అలకలే అందం
ఆ కురులే అందం.
సింహాద్రి జ్యోతిర్మయి
29.4.2018
1 కామెంట్:
dear sir very good blog and very good content
Telugu News
కామెంట్‌ను పోస్ట్ చేయండి