11, ఏప్రిల్ 2018, బుధవారం

ఆటో కష్టాలు.


పూర్వకాలంలో పుష్పకవిమానాలుండేవట. ఎంతమంది ఎక్కినా వాటిలో ఇంకొకరికి స్థానం ఉండేది. ఈనాటి మన ఆటోలు కూడా అంతే. ఈ ఫోటో కి నా మిత్రురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి చక్కని పద్యాలు రాసింది.
ఆ.వె.
పూర్వకాలమందు పుష్పకమ్మను పేరనొక విమాన ముండె చకితమనుచుపలుకనేల?కనుడు ప్రత్యక్షముగ నిపుడా,కుబేరుడు మన కంపెనేమొ!
ఆ.వె.ఎంతమందియున్న నింకొక్కరికి యందుచోటు దొరకగలదు చోద్యమిదియెగగనవీధి వీడి నగరబాట నడచునేటి పుష్పకమ్ము ఆటొరిక్ష.
సింహాద్రి జ్యోతిర్మయి

10.4.2018.

facebook లో నేను పెట్టిన ఈ ఫోటో కి విశేష స్పందన వచ్చింది. మన దేశ జనజీవనంలో 'ఆటో' ఓ ప్రధాన భాగమయిపోయింది. నగరంలోనే కాకుండా గ్రామానికి గ్రామానికీ కూడా ఆటో సౌలభ్యం వచ్చేసింది. బస్సుల కోసం నిరీక్ష్జణ అవసరంలేదు. బస్సులు వాటికి ఉద్దేశించిన స్టాపుల్లోనే ఆగుతాయి. కాని ఆటోవాలాలు మనం ఎక్కడ ఆపమంటే అక్కడె ఆపుతాడు. నగరంలో మేము ఉంటున్న apartments దగ్గర బస్సులకి request stop ఒకటి ఉంది. కాని బస్సు ఎక్కినప్పుడు driver కి ముందుగానే చెప్పుకోవాలి ఫలానా చోట ఆపమని. కొందరు సానుకూలంగా స్పందిస్తారు. కొందరు మొహంలో విసుగు ప్రదర్శిస్తారు. ఆటోవాలా తో ఆ ఇబ్బంది లేదు. అంతవరకూ బాగానే ఉంది. కాని ఆటోతో ఉన్న సదుపాయాలతో పాటు ఇబ్బందులూ ఎక్కువే. మీదనున్న ఫోటో చూసారు కదా. ఇంచుమించుగా బారతదేశమంతటా ఆటోలు overload ఆటో ప్రయాణాలు ఇలాగే ఉంటాయి. విశాఖపట్నం  ఆటోల్లో ఒకవైపునుండే దిగాలి. ఒకవిధంగా అది మంచిదే. పక్కనుండి ఏ బైకో, కారో వచ్చిన వాటి క్రిందపడి ప్రాణానికి ముప్పు తెచ్చుకోనవస్రంలేదు..  హైదరాబాద్ లో ఆటోలకి రెండు వైపులా opening ఉంటాయి. 

ఇంక ఆటోల్లొ పెద్ద స్పీకర్స్ పెట్టి పాటలు వినిపిస్తుంటారు. ఈ శబ్దకాలుష్యం భరించలేనంతగా ఉంటుంది. ఆటో driver ని ఆపమన్నా ఆపడు. పోనీ ఆ పాటలైనా కాస్త మంచివి వినిపిస్తాడా అంటే అదీ లేదు. పాటలో ఒక్క ముక్క కూడా అర్ధం కాదు. 
ఈ ఆటోలకి లోడింగ్ సమస్యలేదు. ఎంతమందినైనా ఎక్కించుకుంటాడు. driver కి చెరువైపులా ఇద్దరు. ఇంక సీట్లలో ఇంచుమించుగా ఒకరి ఒళ్ళో ఇంకొకరు కూర్చున్నట్లే ఉంటుంది. దారిలో ఎవరైనా మనమీదనుండి మన కాళ్ళు తొక్కుతూ ఆటోల్లోకి ఎక్కుతారు. దిగినప్పుడు కూడా అడే అవస్థ.
ఇన్ని ఇబ్బందులున్నా ఆటోల్లో ప్రయాణాలు తప్పడంలేదు. అవసరం మనది. సర్దుకిపోవాల్సిందే మరి !!
-- పొన్నాడ మూర్తి.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...