pencil చిత్రం
ఈ చిత్రానికి కవిత రాసిన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి కి ధన్యవాదాలు.
పసితనపు అమాయకత్వమో
పరువపు కొంటెతనమో
సాధించిన విజయోత్సాహమో
హృదయాన్ని అలముకొన్నప్పుడు మాత్రమే
కళ్ళు వెలుగు దివిటీలు గా మారి
పెదవి అంచుల తెరచాటు తీసి
నవ్వు పువ్వుల రాణిని
నలుగురికీ పరిచయం చేస్తాయి.
కళ్ళల్లో కాంతి నిండితే
అది గురజాడ వారి మధురవాణి నవ్వు
కళ్ళల్లో కలలు చెదిరితే
అది గురజాడవారి
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నవ్వు
నవ్వు వెనక కథలెన్నో!
నవ్వ గలుగు కనులెన్నో!
సింహాద్రి జ్యోతిర్మయి
18.5.2018
పరువపు కొంటెతనమో
సాధించిన విజయోత్సాహమో
హృదయాన్ని అలముకొన్నప్పుడు మాత్రమే
కళ్ళు వెలుగు దివిటీలు గా మారి
పెదవి అంచుల తెరచాటు తీసి
నవ్వు పువ్వుల రాణిని
నలుగురికీ పరిచయం చేస్తాయి.
కళ్ళల్లో కాంతి నిండితే
అది గురజాడ వారి మధురవాణి నవ్వు
కళ్ళల్లో కలలు చెదిరితే
అది గురజాడవారి
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నవ్వు
నవ్వు వెనక కథలెన్నో!
నవ్వ గలుగు కనులెన్నో!
సింహాద్రి జ్యోతిర్మయి
18.5.2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి