4, మే 2018, శుక్రవారం

దాసరి నారాయణ రావు


దాసరి నారాయణరావు (నా పెన్సిల్ చిత్రం)


డా. దాసరి నారాయణరావు ( మే 4, 1942 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

(వికీపీడియా నుండి సేకరణ)




నా 'దాసరి' చిత్రానికి facebook లో మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి స్పందన :

అతడే ( దా ) సరి

రంగుల‌ సినీ ప్రపంచం
అదొక *అద్దాలమేడ*
కొందరినది *ఏడంతస్తుల మేడ** లు ఎక్కిస్తుంది
మరికొందరికదే *బలిపీఠం*

*పాలు నీళ్ళు* ఏకమైనట్లుగా
*స్వర్గం నరకం* ఇక్కడ కలిసే ఉంటాయి

* మనుషులంతా ఒక్కటే* అని
పైకి అంటుంటారు
వీరు మాత్రం *ఎవరికి వారే యమునా తీరే* అన్నట్లు ఉంటారు.
*మామగారు* *నాన్నగారు * అని వరసలు కలుపుకుని అందరిలో ఉన్నప్పుడు ఆప్యాయతలు ఒలకబోస్తూ మాట్లాడుకుంటారు
మనసుల్లో మాత్రం *తూర్పు పడమర * లు గా భావిస్తారు
*ఇదెక్కడి న్యాయం* అని మనం
ఇక్కడ ఎవ్వరినీ అడగలేం
ఆ *దేవుడే దిగివస్తే*
ఈ వింత ప్రపంచాన్ని చూసి
విస్తుపోక తప్పదు.

అలాంటి మన సినీ జగత్తుకి
*ఆత్మబంధువు* అయ్యాడతడు.
ఉత్త *బోళాశంకరుడు*
అతడీ సినీ *భారతంలో ఒక అమ్మాయి* అయిన *రాధమ్మ పెళ్ళి* ని *బుచ్చిబాబు* తో
జరిపించి ఆమెకొక * నీడ * కల్పించాలనుకున్నాడు
సినీ ప్రపంచం మొత్తాన్ని
ఒకే వేదికపై చూడాలన్న
తన చిరకాల వాంఛను
ఈ వంకతో తీర్చుకోవాలనుకున్నాడు
చక్కని *ప్రేమ మందిరం*నిర్మించాడు
తను జరిపించే *ప్రేమాభిషేకం* చూసేందుకు
తప్పక
రావలసినదని
*ఆది దంపతులు* అనదగ్గ
*సీతారాముల* కు
*మేఘ సందేశం* పంపించాడు
పొరపాటున సీతకోసం
*లంకేశ్వరుడు * వస్తాడేమోనని
*రంగూన్ రౌడీ* ని కాపలా పెట్టాడు. *బ్రహ్మ ముడి* వేసుకుని *ఏడడుగుల బంధం* తో ఏకమవుతున్న జంటను
*కళ్యాణ ప్రాప్తిరస్తు * అని దీవించమని పేరు పేరునా అందర్నీ ఆహ్వానించాడు.
అతనికి *చిన్నిల్లు పెద్దిల్లు * అని తేడాలు లేవు
*సూరిగాడు* , * మేస్త్రీ*
మనం చిన్నచూపు చూసి పిలిచే
*ఒరేయ్ రిక్షా* ,*ఒసేయ్ రాములమ్మ* అందరూ అతనికి ఆత్మీయులే.
*స్వప్న* సంతోషం గా వచ్చి అందరికీ *గోరింటాకు* దిద్దింది
*శివరంజని* వచ్చి వధువును
*శ్రీవారి ముచ్చట్లు* అడిగింది

*అమ్మ రాజీనామా * పత్రం చింపేసి మరీ వచ్చి
*దీపారాధన* చేసింది
ఒకే పేరు కలిగిన *తాతా మనవడు* మాట్లాడుకుని
*బొబ్బిలి పులి * లాంటి తాత
*సర్దార్ పాపారాయుడు* తన మనవడిని ఆ కళ్యాణానికి పంపించాడు.
ఆ వేడుక చూడాలనే కుతూహలం తో
*దేవదాసు మళ్ళీ పుట్టాడు*
ఆ దర్శక రత్న సారధ్యంలో
ఏకమైన
చలన చిత్ర పరిశ్రమ
*బంగారు కుటుంబం* లా భాసించి ప్రేక్షకులను అలరించింది.

ఓ దర్శక రత్న దాసరీ!
నీకెవ్వరూ లేరు సరి.

దాసరి జయంతి సందర్భంగా
నా కవితా నివాళి
.
సింహాద్రి జ్యోతిర్మయి
4.5.2018.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Yes he is a true legend of telugu film industry. His absence is felt now.

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...