17, జులై 2018, మంగళవారం

నేను పడిపోతిని - గజల్

నా రేఖా చిత్రానికి మిత్రురాలు లక్ష్మి రాయవరపు గారి తెలుగు గజల్ :

కారుమబ్బు కమ్మినపుడు బెదిరి నేను పడిపోతిని
కన్ను చూపు తగిలి మనసు చెదిరి నేను పడిపోతిని.. 

నేలతల్లి పరచినదీ ఎర ఎర్రని చీరచెరగు
తనకు నాకు బంధమేదొ కుదిరి నేను పడిపోతిని..

నవ్వులన్ని మాలకట్టి వేచానూ నీ కొరకే
కనుల ముందు నిన్ను చూసి అదిరి నేను పడిపోతిని...

ఆకసాన పయనించుచు నవ్విరెవరొ నన్ను చూసి
తళుకు బెళుకు నాకంటగ పొదిరి నేను పడిపోతిని 

వలపు వాన జల్లాయెను కొండ కోన వాగు వంక
కన్ను మిన్ను ఎన్నెలలే ముదిరి నేను పడిపోతిని

1 కామెంట్‌:

Raajee's raajeeyam చెప్పారు...

కింద పడ్డాక నలుగురు నవ్వుతారేమోనని ముందే కారణాలు చెప్తున్నదేమిటీ...ఈ గడుసు పిల్లా..))
బాగుంది సార్..

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...