7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

గజల్ .."చాలునులే"



నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి గుడుపూడి రాధికారాణి గారి గజల్

గజల్ .."చాలునులే".
---------------
చెలిమోమున చిగురించే నవ్వొక్కటి చాలునులే
వనిశోభను వెలిగించే పువ్వొక్కటి చాలునులే
సంగీతపు సరిగమలే మురిపించవు మూర్ఖులను
ఆ మనసును కరిగించే పాటొక్కటి చాలునులే
జామకాయలమ్ము తాత జాలిచూపు చూసెనేల?
ఆ కనులను మెరిపించే పిలుపొక్కటి చాలునులే
బీడుభూమి పోలెనులే అన్నదాత పొడిపెదవులు
పైరులన్ని పరిమళించు వానొక్కటి చాలునులే
యుద్దభూమికేగినట్టి భర్తజాడ తెలియరాదు
ఆమె గుండెగుబులు తీరు కబురొక్కటి చాలునులే
మబ్బుకమ్ము నింగివోలె నీలవేణి నేత్రములు
కలలురాని కలతలేని నిదురొక్కటి చాలునులే
ఊహలలో ఊసులలో హృదిని కుదుపు భావఝరులు
రాధికకే రచనలలో గెలుపొక్కటి చాలునులే
----------------------------------------
గుడిపూడి రాధికారాణి.

3 కామెంట్‌లు:

biograpys చెప్పారు...

nice...
trendingandhra

P Vijay Kumar చెప్పారు...

Murthy garu your art is excellent and the Ghazal for the pic is also good. May I request you to permit me to use your painting for my upcoming book on Ghazal. I am P.Vijay Kumar, from Rajahmundry,My contact no is 9640128560. Kindly respond.

అజ్ఞాత చెప్పారు...


రాణిగారు రచియించిన గజలొక్కటి చాలునులే
మనసులోన మల్లెకుసుమ వాసనలే కురియునులే

గజలులోని భావనలకు గుండెఝల్లుమనెనులే
ఊహల వేదికపై గజలుకన్య నాట్యమాడెనులే

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...