9, ఫిబ్రవరి 2020, ఆదివారం

నాట్యమయూరి టి. బాలసరస్వతి



నృత్యాంగన టి. బాలసరస్వతి గారి నా చిత్రానికి మిత్రుల పద్య స్పందన ః

మిత్రులు శ్రీ TBS Sarma గారి రచన  :

కర్నాట జనియించి ఘనమగు తెలుగును
భాషించి పోషించె పద్మభూష
అనువంశికమ్మగు హావ భావములతో
నాట్య జగతినేలె “నాట్యరాణి”
“ఠాగూరు” ముందట ఠవణిల్ల నాట్యమ్ము
“దేశికోత్త”మునందె దేశికగుచు
“పద్మవిభూషణా” భరణాల ధరణిపై
“బాలసరస్వతి” పరిఢ విల్లె

“సత్యజిత్ రే” మురియుచును చలన చిత్ర
మొకటి నిర్మింప నీపేర నొదగె నమ్మ
దేవ దాసివై ననునీవు దేవ లోక
మందు సల్ప నాట్య మచట కరగినావు.

------------------------------------------------------------------------------------

విజయలక్ష్మి తుమ్మలపల్లి గారి రచన

దేవదాసి కుటుంబ దివ్యరత్నమయిన-
బాలసరస్వతి- వాణి- నిజము!

దేశ దేశాల( నర్తించి ఖ్యాతి గడించె-
నాట్య లోకపు రాణి నామమందె!

నీడు మించి ప్రతిభ నెంతొ కనబరచి-
పొందె పురస్కారములను విరివి!

తెనుగు సంస్కృతములు తెలియవలెననుచు-
పలికె నిరంతర పాఠిననుచు!

తేటగీతి-

దివికి నేగె- నచటగూడ దృప్తిదీర-
నలర జేయంగ వారల- నమితమైన
తనదు ప్రావీణ్యమంతయు గనగజేసి-
గొప్ప పేరొంద నింకను- మెప్పు నొంది

------------------------------------------------------------------------------


శ్యామల రుద్రరాజు గారి పద్య స్పందన

పద్మము బాల సరస్వతి
పద్మ విభూషణ మయూరి బంగరు లతయౌ
పద్మముఖి నృత్య భారతి
పద్మజుని సతి మహిమగ భువనమున వెలిగే.

-------------------------------------------------------------------------

గంగా భావాని దేవి గారి పద్య స్పందన (Whatsapp)

మధుర గీతాలు పాడగ మహితనొంది
నాట్యరీతులు నర్తించి నవరసముల
నాల్గు దిశలప్రదర్శించి నాట్యశీలి
యశము బడిసితి వమ్మరో యద్భుతముగ

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...