నవ్వించడమనేది ఓ అద్భుతమైన కళ. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మాట్లాడి అప్పటికప్పుడు నవ్వు రప్పించేవారు జోకిస్టులు.
నాలుగు దశాబ్దాల్లో వేలాది బొమ్మలు
అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ప్రచురణ
వందలాది అవార్డులు, రివార్డులు పొందిన తెలుగు మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి వర్ధంతి నేడు.
కార్టూన్ కళ ఏ కొద్ది మందికో దక్కే అపురూప వరం. ఆ నైపుణ్యం పట్టుబడాలంటే ఎంత జీవితం చూడాలి ? ఇంకెంత అవగాహన కావాలి ? మరెంత అనుభవం కావాలి ? - అంటారు ఆ విద్య తెలిసిన వారు. అయితే, ఆ వ్యంగ్య చిత్ర విధూషీమణి భాష్యంగా చూసిన ప్రపంచం అతి పరిమితం. ఇటువంటి స్థితిలోనూ ఆ పరిధిని అధిగమించి మానవ జీవితంలో అన్ని పార్వ్యాలనూ ఆమె విభిన్న కోణంలో సందర్శించగలిగారు. గిలిగింతలు పెట్టే హాస్యంతో, సున్నితమైన చమత్కారంతో జీవన చిత్రాలను పాఠకుల కళ్లముందుంచగలిగారు. ఆమెనే విశాఖ నగరానికి చెందిన రాగతి పండరి. నేడు ఆమె ఐదో వర్థంతి సందర్భంగా నా స్మృత్యంజలి.
1 కామెంట్:
అవునండి, ఆ రోజుల్లో ప్రఖ్యాత కార్టూనిస్ట్ రాగతి పండరి గారు. పోలియో అవకరం ఉన్నా నిరుత్సాహపడక కార్టూన్ కళలో ఉన్నత శిఖరాలు అధిగమించారు. 50 యేళ్ళ వయసుకే మరణించడం విచారకరం. 🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి