31, ఆగస్టు 2020, సోమవారం

రంగస్థల ఘనాపాటి పీసపాటి నరసింహమూర్తి

 




శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు(1920 -2007) ప్రముఖ రంగస్థల నటుడు. తెలుగు నాటకరంగంపై శ్రీ కృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు.పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు. శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, విజయనగరం జిల్లా, బలిజపేట మండలం, వంతరం అనే గ్రామంలో 1920 జూలై 10 న జన్మించారు.


చాలా చిన్నప్పుడే నేను వీరి పేరు వినడమే కాకుండా వారు ప్రదర్శించిన నాటకం కూడా వీక్షించే అవకాశం లభించింది. చిత్రకారునిగా నేను ఎందరో ప్రముఖుల చిత్రాలను నా pencil తో చిత్రీకరించే అవకాశం లభించింది. అలాగే వీరి చిత్రం కూడా వేయాలని అనుకుంటుండగా నాకు వీరి కుటుంబ సభ్యుల పరిచయ భాగ్యం కలిగింది. వీరి కోడలు తమ మామగారైన పీసపాటి వారి చిత్రం చిత్రీకరించిన మని కోరడం, నేను వేయడం జరిగింది. నేను సేకరించిన వివరాలతో వారి చిత్రం facebook లో పోస్ట్ చెయ్యడం, దానికి విశేష స్పందన లభించింది.


ఇటీవల సాక్షి దినపత్రిక వారు నన్ను సంప్రదించి ఆ చిత్రాన్ని ఓ వ్యాసానికి ఆ చిత్రాన్ని తేసుకోవచ్చా అని అడిగారు. నాకు చాలా ఆనందం కలిగింది. నిన్న విడుదలైన సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఆ చిత్రంతో పాటు శ్రీ రాంభట్ల నరసింహమూర్తి గారి వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసం లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చదవమని మనవి.

https://epaper.sakshi.com/2802835/Funday/30-08-2020#page/28/2


ధన్యవాదాలు

21, ఆగస్టు 2020, శుక్రవారం

మాలతీ చందూర్


స్మరించుకుందాం - మాలతీ చందూర్ (Pencil sketch)
1950ల నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (1930 - ఆగష్టు 21, 2013) పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య
అకాడమీ బహుమతి గ్రహీత.
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. తమిళం నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించారు.
మాలతీ చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడ్డారు.2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు.మెడికల్ కాలేజీకి శరీర దానం చేశారు. (source : వికీపీడియా)
(ఈ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ఈ చిత్రం ప్రచిరించబడింది. పత్రిక సంపాదకవర్గానికి నా ధన్యవాదాలు)

వీరి గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో, 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో :

 

15, ఆగస్టు 2020, శనివారం

శ్రీ అరబిందో

(My pencil sketch)


            అరబిందో (ఆగస్టు 15, 1872-డిసెంబరు 5, 1950) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, గురువు. వీరు భారత స్వతంత్ర స్ంగ్రామంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విలువలతో నాయకులను ప్రభావితం చేసారు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల వీరి భావనలు పరిచయం చేస్తూ రచననలు చేసారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించారు.


మానవుని జీవితంలో ఆధ్యాత్మిక యొక్క విశిష్టతను తను పాటించి, మనకు చూపించిన మహాయోగి శ్రీ అరవిందుల వారు.

ఏ కార్యమైనా అది కేవలం ఈశ్వరేచ్ఛతోనే జరుగునని ఈశ్వరానుగ్రహె సంపాదించడమే ప్రతి మనిషి జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలని చాటిన గొప్ప మహనీయుడు శ్రీ అరవిందుల వారు.

తనకు జరిగిన అనుభవాలను పుస్తకరూపంలో పెట్టి ‘సావిత్రి’ లాంటి రచనలు చేసి, తన జ్ఞానాన్ని, తన ఆలోచనలను, యోగశక్తిని ప్రపంచానికి పంచిన జ్ఞానవేత్త శ్రీ అరవిందుల వారు.

జీవితంలో ఉన్నత లక్ష్యాలు, లక్ష్యం కోసం నిరంతరం పాటుపడిన శ్రీ అరవిందుల వారి జీవితం ఎందరికో స్ఫూర్తి నిస్తుంది.

మనిషి తన జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ లక్ష్యం సాధించాలో, ఏ మార్గంలో ప్రయాణించాలో తెలుసుకోవాలంటే శ్రీ అరవిందుల వారి జీవితంలో మనకి కనిపిస్తాయి.

గమ్యాన్ని చేరుకోవటంలో పాటించిన నియమాలు, ఎదురైనా చేదు అనుభవాలు, కష్టాలు తట్టుకోవడంలో ఈశ్వరానుగ్రహం కోసం చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా శ్రీ అరవిందుల వారి జీవితంలో మనకి కనిపిస్తాయి.

 

11, ఆగస్టు 2020, మంగళవారం

ఇల్లాలే ఆధారం - (కరోనా నేపధ్యంలో ఓ కధ)

 whatsapp లో నాకు forward అయ్యి వచ్చిన ఓ చక్కని పోస్ట్ కి నా బొమ్మ.. ఈ పోస్ట్ పెట్టిన అజ్ఞాత వ్యక్తి కి నా ధన్యవాదాలు.


"ఇల్లాలే ఆధారం

మా పక్క పోర్షన్ లో ఒక్క యువ జంట ఉంటారు...
వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు...
ఇంకా పిల్లలు లేరు....
ప్రస్తుత పరిస్థితి వలన ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నారు...
ఆ ఆఫీస్ పని...ఈ పనిమనుషులు రాకపోవడం వలన ఇంట్లో పనులు చేసుకోవడం వాళ్ళ వల్ల కాక అతలాకుతలం అయిపోతున్నారు...
కానీ తప్పదు కదా...

"ఏదో ఈ పూట అలిసిపోయాం ఆన్ లైన్ లో ఫుడ్ తెప్పించేసుకుందాంలే అనే రోజులు కూడా కాదు..."
చచ్చినట్లు ఇంట్లోనే ఏదో వండుకుని తినాల్సిందే...
ఇలాంటి రోజులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు ఎప్పుడూ...

నా కైతే ఈ పనులు అవీ అలవాటే...
ఏదో అంట్లు తోముకోవడం..ఇల్లు తుడుచుకోవడం తప్పినా..మిగిలిన పనులు చేసుకోక ఎప్పుడూ తప్పదు...
వంట అనేది అనివార్యం...
అది కాకుండా ఇల్లు శుభ్రం చేసుకోవడం చాలా పెద్ద టాస్క్...
కుర్చీలు, టేబుల్, సోఫాలు తుడుచుకోవడం...కిచెన్ లో అంతా శుభ్రం గా పెట్టుకోవడం...
బాత్రూములు కడగటం నేనే చేసుకుంటాను...
ఇల్లు నీట్ గా పెట్టుకోవడం లో నాకు చాలా సంతృప్తి ఉంది...
అది చాదస్తం గా ఇంట్లోవాళ్ళు తీసి పడేసినా నేను చేస్తూనే ఉంటాను...
ఇంట్లో ఎక్కడైనా కూడా వేలితో రాస్తే దుమ్ము అంటుకోకూడదని నా పాలసీ...
అద్దం లా ఉంచుతాను...
కానీ వయసు 50 దాటాక కొంచెం కష్టమనిపిస్తోంది...
ఇలా పైకి అనుకుంటే..."నిన్ను ఎవరు చేయమన్నారు..?
అలా వదిలేయొచ్చు కదా అంటారు" ఆయన..పిల్లలూ కూడా...
ఇప్పుడు పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండటం లేదు...నేను ఆయనే ఉంటాం...
అయినా నేను మారలేదు...వంట నా హాబీ..
రుచికరంగా ఎప్పుడూ వంట చేయాలనుకుంటాను...వెరైటీస్ కూడా చేయడం ఇష్టం..
ఈ మానసిక సంతృప్తి ముందు నా శారీరిక శ్రమని అస్సలు పట్టించుకోను...

అయితే ఈ రోజు...పక్క పోర్షన్ లో వాళ్ళింటికి ఇద్దరు వచ్చి ఏవో పనులు చేసి వెళ్లారు...కొంచెం హడావిడి గా అనిపించి ఏంటా అని ఆ అమ్మాయి కనపడినప్పుడు అడిగితే...
ఏం లేదాంటీ ఈ రోజు లో ఆన్లైన్ లో చూసి... నవీన్ మా బాత్రూములు కడగటానికి, ఫ్యాన్లు తుడవడానికి ఇద్దరి పనివాళ్ళని పిలిచాడు...
వాళ్లొచ్చి ఆ పని చేసి వెళ్లారు...
అవన్నీ మేమెక్కడ చేసుకోగలం చెప్పండి అంది...

"ఓ..అవునా అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారా...
ఎంత తీసుకున్నారేంటి అని అడిగాను నేను..."

రెండు బాత్ రూమ్ లు కడిగి ...నాలుగు ఫ్యాన్లు తుడవడానికి రెండు వేలు తీసుకున్నారు...
వాళ్ళు ప్రొఫెషనల్ ఆంటీ..చాలా బాగా క్లీన్ చేశారు అంది
ఆ అమ్మాయి...
కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ఇంట్లోకి వచ్చేసాను...

కానీ.. నా బుర్రలో ఒక ప్రశ్న తొలిచేస్తోంది...
ఒక్కసారి బాత్రూములు కడిగి ఫ్యాన్లు తుడిస్తే ..రెండు వేలు అయితే...
ఈ లెక్కన నేను పాతికేళ్లుగా రోజూ బాత్రూములు అద్దంలా కడుగుతూ...
నెలకి రెండుసార్లు ఫ్యాన్లు తుడుస్తూ...రోజూ ఇల్లంతా డస్టింగ్ చేస్తూ...
రుచికరంగా వంటలు చేస్తున్న నాకు ఎంత రావాలి...?
నేను ఎంత సంపాదించి ఉండేదాన్ని...
ఆలోచిస్తే నేను ఎంత దోపిడీకి గురయ్యానో కదా అనిపిస్తోంది...

కనీసం నా పనికి నెలకి నాకు పదివేలు ఇచ్చినా...ఇరవైదు సంవత్సరాల నా సంపాదన ఈ పాటికి 25 లక్షలు దాటి ఉండేది...నాకంటూ బాంక్ బాలన్స్ ఉండేది...
ఏ ఉద్యోగం చేసి రిటైర్ అయినా ఏవో ఫైనల్ బెనిఫిట్స్ అంటూ ఉంటాయి...
ఈ ఇల్లాలి ఉద్యోగానికి ఏదీ లేదు...

నీ ఇల్లు నువ్వు చేసుకున్నావు...ఇందులో గొప్ప ఏముంది అంటారు..
నాకు ఎవ్వరూ లోటు చేయరు ఇంట్లో..ఏది కావాలంటే అది కొనిచ్చే భర్త...పిల్లలు ఉన్నారు...
కానీ ఏదైనా ఎవరో కొనివ్వాల్సిందే... నాకంటూ ఒక పైసా లేదు..
అంతా నీదే కదా అంటారు తను....
నిజమే...అంతా నిజమే...
కానీ ఏదో లోటు గా అనిపిస్తోంది ఈ రోజు...
నన్ను అందరూ ఉపయోగించేసుకున్నారనే బాధ...

లాభం లేదని తనతో అదే... మా వారి దగ్గర నా అక్కసు వెళ్ల గక్కాను....
తను పకపకా నవ్వుతూ అన్నారు...
ఓ...ఇదా నీ బాధ...
పక్కవాళ్ళింట్లో గంట పని చేసి వాళ్ళు రెండువేల తీసుకు వెళ్లిపోయారు....
అంతవరకే వాళ్ళ సంబంధం...
వాళ్ళు పని చేసి వెళ్లారని, చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు...ఎందుకంటే వాళ్ళు డబ్బిచ్చేసారు కాబట్టి...
చేసిన వాళ్ళు కూడా ఈ చేయించుకున్న వాళ్ళని బయటికి వెళ్ళగానే మర్చిపోతారు...
అక్కడ డబ్బుతోనే సంబంధం...అంతే..!!

కానీ నువ్వు అలా కాదే...
నువ్వు అలా పని చేసి నన్ను పిల్లల్ని చూసుకున్నావు కాబట్టే...
నేను ఇన్నేళ్లు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలిగాను...
మన పిల్లలిద్దరూ బ్రహ్మాoడం గా చదువుకుని చక్కగా సెటిల్ అయ్యారు....
మేము ఎప్పుడూ నీ దగ్గర బయట పడక పోవచ్చు...నీ
మొహం మీద పొగడక పోవచ్చు...
మా మనసులో నీ పట్ల కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది...

పిల్లలు ఇప్పటికీ మాటల్లో అంటూనే ఉంటారు...
అమ్మ ఎంత చేసింది మాకు...కాలేజ్ లోకి వచ్చినా మాకు తినిపించేది...ఎంతో రుచికరం గా వంటలు చేసి పెట్టేది...
అంత ఓపిక మాకు ఉంటుందా అనిపిస్తుంది అని....

నువ్వు లేకపోతే మేము లేము...
ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండి... మేము హ్యాపీ గా ఉండటానికి మూలం నువ్వు...
నిజం చెప్తున్నా...నాడబ్బు అంతా నీదే...
నీకు ఒక రేట్ కట్టి ఇచ్చి నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు...

నీకో సంగతి తెలుసా మన బాంక్ బాలన్స్ అంతా నీపేరు మీదే ఉంది....
టాక్స్ తక్కువ పడుతుందని నీ పేరు మీదే వేసా...
ఈ ఇల్లు కూడా నీ పేరు మీదే ఉంది...
ఏరోజైనా నీకు కోపం వచ్చి "ఇది నాయిల్లు...బయటికి పో" ..అంటే నేను బయటికి పోవాల్సిందే అన్నారు నవ్వుతూ....
నాకూ నవ్వొచ్చింది తన మాటలకి...

పిల్లలకి నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని చెప్తే...నెలకి ఏభైవేలు నీకు పంపించగలరు...
నేను మనకి ఉన్నది చాలు అని ఒక్క పైసా కూడా వాళ్ళని అడగను...
నువ్వు జీవం మాకు...ఈ ఇంటికి మహారాణివి...మేమందరం నీ మీదే ఆధారపడి ఉన్నాం అన్ని విధాలా...
నీలో ఇలాంటి అసంతృప్తి ఉందని ఈరోజు వరకూ మా కెవ్వరికీ తెలీదు...

పనమ్మాయికి ఇంకో వెయ్యి రూపాయలు ఇచ్చి నీకు అవసరమనుకున్న పనులన్నీ చేయించుకో...
నేను వద్దన్నానా...
నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే మేమూ బాగుంటాం.. అది గుర్తు పెట్టుకో అన్నారు...

నేను నవ్వుతూ..."చాలు చాలు...
నా ఆలోచన ...ఎంత మూర్ఖం గా ఉందో అర్ధమయ్యింది ఇది మనసులో పెట్టుకోకండి అన్నాను" మనస్ఫూర్తిగా...!!

అవును ఇది నా ఇల్లు..వీళ్లంతా నా వాళ్ళు అనుకున్నాను సంతృప్తి గా...
ఈ సంతృప్తి ఎన్ని లక్షలు పెడితే వస్తుంది..?
ఇంకెప్పుడూ నేను ఇలా ఆలోచించకూడదు గట్టిగా అనుకున్నాను...."

4, ఆగస్టు 2020, మంగళవారం

ప్రజా గాయకుడు విప్లవ కవి వంగపడు ప్రసాదరావు


My pen sketch

నివాళి : ఈ రోజు మృతి చెందిన ప్రజాగాయకుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావు (rapid pen sketch)

ప్రజా గాయకుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావు;
పదునైన పదాలకు సొంపైన బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు ప్రసాదరావు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు.
ఆ గజ్జెల శబ్దం ఇప్పుడు ఆగిపోయింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తన పాటలతో ఉత్తరాంధ్ర జానపద శైలిని తెలుగు నేల అంతటికీ పరిచయం చేసిన వంగపండు తన పాటలు, రచనలతో అనేక మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు.
విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా పనిచేస్తూ ఆయన ప్రజా ఉద్యమాలవైపు నడిచారు. అనంతర కాలంలో తన ఉద్యోగానికి రాజీనామ చేసి పూర్తి సమయం ప్రజా ఉద్యమాలకే కేటాయించారు.
1969 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగిన గిరిజన, రైతాంగ పోరాట కాలంలో ఆయన తన కళా ప్రదర్శనలతో ప్రజాదరణ పొందారు.

రాముడుద్భవించినాడు రఘు కులంబున




రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమవుతున్న
శుభతరుణంలో ఒక చక్కని కీర్తన వినండి..

శ్రీ ప్రయాగ రంగదాసు గారు రచించిన ఈ శ్రీరామ కీర్తనను
ఆయన మనవడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఎంత భక్తి పారవశ్యం తో జంఝూటి రాగంలో ఆలాపించారో వినండి..




రాముడుద్భవించినాడు రఘు కులంబున శ్రీ ||రాముడు||
తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ || రాముడు||
తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్న మరయగ సురవరులెల్ల
విని కురియింప విరుల వాన ||రాముడు ||
దశరధుండు భూసురులకు ధనమొసంగ
విసర మలయ మారుతము - దశలెల్లను విశదములౌ
వసుమతి దుర్భరము బాప ||రాముడు ||
కలువలను మించి కనుల కాంతి వెల్గగా
పలువరుసా కలములొయన
కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు ||
ధరను గుడిమెళ్ళంక పురమునరపి బ్రోవగా
కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను
కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు ||
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః



(" జై శ్రీరామ" అనే ఈ జగజ్జైత్రైక మంత్రాన్ని ఒక్కసారి
జపించండి)

3, ఆగస్టు 2020, సోమవారం

దేవరకొండ బాలగంగాధర తిలక్ - Devarakonda Bala Gangadhar Tilak

(Pencil sketch)

దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966) శతజయంతి ఉత్సవాలు సందర్భంగా - (Pencil sketch)
వీరు ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు. భావ కవులలొ అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం.
తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.
వచన కవితా పాదాలుః
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు[1]
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
దేవుడా! రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి, పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి.
తిలక్‌పై ఇతరుల వ్యాఖ్యలు:
యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్పాటికా ఫలకం
గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
--శ్రీశ్రీ (వికీపీడియా సౌజన్యంతో)ఏ

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...