21, ఆగస్టు 2020, శుక్రవారం

మాలతీ చందూర్


స్మరించుకుందాం - మాలతీ చందూర్ (Pencil sketch)
1950ల నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (1930 - ఆగష్టు 21, 2013) పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య
అకాడమీ బహుమతి గ్రహీత.
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. తమిళం నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించారు.
మాలతీ చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడ్డారు.2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు.మెడికల్ కాలేజీకి శరీర దానం చేశారు. (source : వికీపీడియా)
(ఈ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ఈ చిత్రం ప్రచిరించబడింది. పత్రిక సంపాదకవర్గానికి నా ధన్యవాదాలు)

వీరి గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో, 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో :

 

చిత్రానికి పద్యాలు

నా చిత్రానికి పద్య రచనలు చేసిన కవయిత్రులకు నా ధన్యవాదాలు నగవులు పూచెడిదగు నీ మొగమది వసివాడిపోయి ముకుళించినదే... మగువా! నీ కన్నులలో దిగులుకు ...