సంగీత స్వరకర్త జైదేవ్ - మూడు సార్లు జాతీయ పురస్కారాలు పొందినా అజ్ఞాతంగా తనువు చాలించిన అసమాన ప్రతిభావంతుడు.
సంగీత ప్రపంచంలో జైదేవ్ ఓ Unsung Hero. (కెన్యాలో 3 ఆగస్ట్ 1918 జన్మించాడు, మరణం 6 జనవరి 1987) - వారు స్వరపరచిన కొన్ని మచ్చుతునకలు :
"అభి నా జావో చోడ్ కర్ (Hum Dono)
"అల్లా తేరో నామ్,.." (Hum Dono)
"దో దివానే షెహర్ మే..." (Gharonda)
""తూ చందా మైన్ చాందినీ ... (Reshma aur Shera)
नदी नारे ना जाओ श्याम पैयाँ पडूँ (Muje jeene do)
రాత్ భీ హై కుచ్ భీగీ భీగీ" (Mujhe jeene do)
"యే దిల్ ఔర్ ఉన్ కీ నిగహోం కే సాయే" (Prem Parbat) etc.
మూడు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న తొలి సంగీత దర్శకుడు జైదేవ్.
1961లో Hum Dono తో జైదేవ్ సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షించాడు.
40 సినిమాలు మరియు దాదాపు 250 పాటలు ఉన్నప్పటికీ, ‘అన్‌సంగ్’ మరియు ‘జిన్క్స్డ్’ వంటి ట్యాగ్‌లు జైదేవ్‌ను వెనుకంజలో ఉంచాయి. సలీల్ చౌదరి, మదన్ మోహన్, రోషన్, వసంత్ దేశాయ్ వంటి మహానుభావుల సరసన చేరదగ్గ మహానుభావుడు.
వివాహం చేసుకోలేదు. ఒంటరి జీవితం. నెలకి ఎనభై రూపాయల అద్దె చెల్లించలేక తను ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. వారసులు లేరు. ఆస్థామా తో బాధపడుతూ అనాధ ప్రేతగా తనువు చాలించాడు. కాని అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి