29, మే 2023, సోమవారం

వద్దు వద్దు సటలింక వామనా నీ వద్దనే వున్నార మిదె వామనా || - అన్నమయ్య కీర్తన


 

శ్రీహరి ప్రత్యక్ష వ్యాఖ్యానమే శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తి. అతడు వామనుడై యాచించినాడు. త్రివిక్రముడై ఉగ్రహించినాడు. అందరినీ వలచినాడు, వలపించినాడు. భక్తుల మానస వీధులలో చిందులు వేసినాడు. 

వద్దు వద్దు సట లింక వామనా
వద్దనే వున్నార మిదె వామనా। IIపల్లవిII

వరుసలు వెదకేవు వామనా నీవు
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా . IIవద్దుII

వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచూకోమీ వామనా . IIవద్దుII

వాడవారు మొక్కేరు వామనా నీకు
వాదుదేరె కెమ్మోవి వామనా
వాదికె శ్రీవేంకటాద్రి వామనా
వాడేచెలమవు నీవు వామనా . IIవద్దుII

8, మే 2023, సోమవారం

దాశరథి రంగాచార్యులు

 


Charcoal pencil sketch 


దాశరధరంగాచార్యులు -- మార్క్సిస్టు దృక్పథం కలిగిన రచయిత. సమాజ గమనాన్ని సునిశితంగా పరిశీలించిన వ్యక్తి. దాశరథి రంగాచార్య అనగానే ‘చిల్లరదేవుళ్లు’ నవల గుర్తుకు వస్తుంది.


తెలంగాణా జనజీవితాలు, ఉద్యమాలు, రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకోవాలంటే రంగాచార్య నవలలు చదవాలి. ఆయన సాహితీ సృజన అనన్య అనన్యసామాన్యం. నభూతో నభవిష్యతి. తన రచనల ద్వారా విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించాడు. సంప్రదాయం పునాదులమీద ఎదిగిన అభ్యుదయ సాహిత్య గోపురం దాశరథి రంగాచార్య.




3, మే 2023, బుధవారం

అమ్రుతా ప్రీతమ్ - రచయిత్రి


 అమ్రుతా ప్రీతమ్ - ప్రముఖ పంజాబీ రచయిత్రి - charcoal pencil చిత్రం.


పద్మశ్రీ, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ, జ్ఞ్నానపీఠ  తదితర పురస్కార గ్రహీత.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...