శ్రీహరి ప్రత్యక్ష వ్యాఖ్యానమే శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తి. అతడు వామనుడై యాచించినాడు. త్రివిక్రముడై ఉగ్రహించినాడు. అందరినీ వలచినాడు, వలపించినాడు. భక్తుల మానస వీధులలో చిందులు వేసినాడు.
వద్దు వద్దు సట లింక వామనా
వద్దనే వున్నార మిదె వామనా। IIపల్లవిII
వరుసలు వెదకేవు వామనా నీవు
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా . IIవద్దుII
వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచూకోమీ వామనా . IIవద్దుII
వాడవారు మొక్కేరు వామనా నీకు
వాదుదేరె కెమ్మోవి వామనా
వాదికె శ్రీవేంకటాద్రి వామనా
వాడేచెలమవు నీవు వామనా . IIవద్దుII
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి