28, అక్టోబర్ 2023, శనివారం

చెంబై వైద్యనాథ్ భాగవతార్

charcoal pencil sketch drawn by me.
 

చెంబై వైద్యనాథ భాగవతార్ పాలక్కాడుకు చెందిన కర్ణాటక సంగీత విద్యాంసుడు. ఇతడు తన గ్రామం పేరు "చెంబై" పేరుతో లేదా "భాగవతార్" పేరుతో సుపరిచితుడు. ఇతడు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో అనంత భాగవతార్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు 1890 సంవత్సరంలో జన్మాష్టమి నాడు పాలక్కాడ్ సమీపంలోని "కొట్టాయ్" గ్రామంలో జన్మించాడు. (సౌజన్యం : వికీపీడియా


వీరి గురించి మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నా  youtube channel క్లిక్ చెయ్యండి.



25, అక్టోబర్ 2023, బుధవారం

టి. ఎన్. రాజరత్నం పిళ్ళై - T. N. Rajartinam Pillai, Nadaswara Maestro

Thirumarugal Natesapillai Rajarathinam Pillai or TNR was an Indian Carnatic musician, nadaswaram maestro, vocalist and film actor. He was popularly known as "Nadaswara Chakravarthi"

నా చిత్రకళ హాబీతో ఈ రోజు టి. ఎన్. రాజరత్నం పిళ్ళై చిత్రాన్ని చిత్రీకరించుకున్నానూ. వీరి గురించి క్లుప్తంగాః

తిరుమరుగల్ నటేసపిల్లై రాజరథినం పిళ్లై (27 ఆగష్టు 1898 - 12 డిసెంబర్ 1956) లేదా TNR ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు , నాదస్వర విద్వాంసుడు , గాయకుడు మరియు చలనచిత్ర నటుడు.  అతను "నాదస్వర చక్రవర్తి" (అక్షరాలా, నాదస్వరం చక్రవర్తి)గా ప్రసిద్ధి చెందాడు.


భారతీయ తపాలా శాఖ వీరి గౌరవార్ధం ఓ తపాలా బిళ్ల విడుదల చేసింది.


మరిన్ని వివరాలు వికీపీడియాలో శొధించగలరు.

 

21, అక్టోబర్ 2023, శనివారం

ఎమ్. ఎస్. స్వామినాథన్ - హరిత విప్లవ పితామహుడు




ఎమ్. ఎస్. స్వామినాథన్  (charcoal pencil sketch)

వీరి గురించి క్లుప్తంగా :


మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ 
(1925 ఆగస్టు 7 - 2023 సెప్టెంబరు 28) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా పనిచేశారు. అతను ప్రపంచంలో ఆకలి పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు.
 

14, అక్టోబర్ 2023, శనివారం

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ - కర్ణాటక సంగీత విద్వాంసులు


ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ (9 ఏప్రిల్ 1899 – 25 మార్చి 1975) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు 1920-1940ల మధ్యకాలంలో అనేక సంగీత ప్రదర్శనలు చేశాడు. కచేరీలు చేయడం మానుకొన్న తర్వాత కర్ణాటక సంగీత గురువుగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తలమానికంగా నిలిచాడు.


వీరి గౌరవార్థం భారతీయ తపాలా శాఖ వారు ఓ తపాలా బిళ్ళ విడుదల చేశారు.

6, అక్టోబర్ 2023, శుక్రవారం

పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా - అన్నమయ్య కీర్తన


పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా
చరణం 1
కామినుల జూచి చూచి కన్నుల గొంతపాపము
వేమరు నిందలు విని వీనుల గొంతపాపము
నామువార గల్లలాడి నాలిక గొంతపాపము
గోమున పాపము మేన గుప్పలాయ నివిగో

చరణం 2
కానిచోట్లకు నేగి కాగిళ్ళ గొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల గొంతపాపము
మాననికోపమే పెంచి మతి గొంతపాపము
పూని పాపములే నాలో బోగులాయ నివిగో

చరణం 3
చేసినట్టి వాడగాన చెప్ప నీకు జోటులేదు
దాసుడ నేనైతి గొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ బనులు

తాత్పర్యం :
మానవుడిగా ఈ భూమిమీద పుట్టిన రోజునుండి ఇంతవరకు నేను చేసిన మంచిపనులేమైనా ఉన్నాయా? ఏ మంచిపనులూ చేసెరగని నన్ను ఎలా కాడతేరుస్తావో?

వలపుతో సంబంధంలేకుండ కనబడినవారినెల్ల కామముతో చూసి కన్నులతో కొంత పాపము చేశాను. లోలోపలున్న చెడ్డవాణ్ణి(pervert) తృప్తి పరిచేందుకు చేరకూడని వారితో చేరి వినకూడని మాటలు విని చెవ్వులతో కొంత పాపము చేశాను. నోటిలో ఆవిరెండిపోయేంతవరకు అబద్ధమూ, దుర్భాషణమూ ఆడి నాలుకతో కొంతపాపము చేశాను. ఉన్నదెల్లా లెక్కలేని పాపములతో నింపుకున్న కాయము తప్ప మరోకటి లేదు!

వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి చేరకూడనివారిని కూడి భుజాంతరాల్లో కొంతపాపమంటించుకున్నాను. ఒళ్ళు వంచి పని చేయకపోవడమే కాదు నా పనులనుకూడా నౌకర్లతో చేయించుకుని చేతులకు మట్టంటకుండ చూసుకొని పాపమంటించాను. ఎల్లవేళలా అంతులేని కోపంతో రగిలే మతితో విహరించి మనసుకి పాపమంటించాను. ఇలా పాపుములు నాలో పూని మేనంతా పోగులైయున్నది.

ఎంతవాడైనాగానీ తాను చేసిన అన్ని తప్పులూ తానంతట తాను చెప్పుకోలేడు; దాచేస్తాడు. నేనూ అంతే! ఇన్ని పాపములు చేసినవాడిని నేనే; అన్నీ చెప్పలేకున్నాను. నీకు తెలుసు నేను పాపిని అని. నిన్ను శరణని దాస్యం వేడి వచ్చినరోజు నన్ను క్షమించ దయతలచుకున్నావు! ఇంతటి దయాళుత్వముగల నిన్ను నేను ఏమని నుతించగలనో? నా ప్రియాతి ప్రియమైన శ్రీవెంకటేశా, ప్రపంచంలోని అన్ని క్రియలూ నివలన జరుగునవే!

భావం : Courtesy శ్రీ అవినేని భాస్కర్
చిత్రం : పొన్నాడ మూర్తి

4, అక్టోబర్ 2023, బుధవారం

డాక్టర్ వర్ఘీస్ కురియన్ - శ్వేత విప్లవ పితామహుడు


charcoal pencil sketch drawn by me.


డాక్టరి వర్ఘీస్ కురియన్ (నవంబర్26, 1921 – సెప్టెంబరు 9, 2012) భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు.  భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.ఆయన యొక్క "బిలియన్ లీటర్ ఐడియా" (ఆపరేషన్ ప్లడ్ - ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది. ఈ కార్యాచరణ భారత దేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచంలో నిలిపింది. 1998 లో పాల ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారత దేశాన్ని నిలిపాడు. 2010-11 లో ప్రపంచ వ్యాప్తంగా 17 శాతం గ్లోబల్ అవుట్ పుట్ ను సాధించగలిగాడు. అనగా ప్రతి వ్యక్తికి 30 సంవత్సరాలలో రెట్టింపు పాల లభ్యత సాధించగలిగాడు. పాడి పరిశ్రమ భారతదేశం యొక్క అతిపెద్ద స్వీయ నిరంతర పరిశ్రమ అయ్యింది. అతను, తరువాత దేశం వంట నూనెల ఉత్పత్తిలో కూడా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ప్రయత్నించి, పాక్షికంగా విజయవంతం అయ్యారు.


(సౌజన్యం : వికీపీడియా)

3, అక్టోబర్ 2023, మంగళవారం

కపిలవాయి రామనాథశాస్త్రి - ప్రసిద్ధ రంగస్థలం నటుడు



కపిలవాయి రామనాఠశాస్త్రి. ప్రసిద్ధ రంగస్థల నటులు. 1899 లో విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు. 1935 లో మరణించారు.


వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.


ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు
 

2, అక్టోబర్ 2023, సోమవారం

కనుపర్తి వరలక్ష్మమ్మ

 

charcoal pencil sketch of Kanuparti Varalakshmamma drawn by me.


కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక 
గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించేరు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేసేయి. ఒక రచయిత్రి ఒక పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే ప్రథమంగా గణింపబడుతోంది. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.


https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%A8%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...