3, మార్చి 2025, సోమవారం

తెలుగమ్మాయి - గజల్

 

మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా

గజల్ 

రచన చల్లా రాంబాబు 


పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి 

అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి


అచ్చతెలుగు మూర్తిగారిఆడపడుచు 

సంప్రదాయ దుస్తులతొ తెలుగమ్మాయి 


కట్టుబొట్టు కుదురుకున్న కుందనపుబొమ్మ

పడుచువాళ్ళు కవ్వింపుతొ తెలుగమ్మాయి 


వెన్నలంటి జాలువారు మందహాసము

జాబిలివలెనగుమోముతొ తెలుగమ్మాయి 


ఎవరురారు నాసరియను ఆత్మస్థైర్యము

కానరానీ కులుకులతొ తెలుగమ్మాయి

కామెంట్‌లు లేవు:

ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే - గజల్

 చిత్రానికి చిన్న ప్రయత్నం.... ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే ౹౹ చూపులో ధైర్యాలు చెలరేగు ప్రశ్నలూ సందిగ్ధ...