నవ్వుల పుత్తడిబొమ్మా...
రచన:మాలా కుమార్
నవ్వుల పుత్తడిబొమ్మా...
మా కలల రూపం నీవమ్మా...
మా చిరు తోటలో కొమ్మా...
చిగురించిన పూల వనమే నీవమ్మా...
మా కంటి పాపగా... మా పాపగా...
వరాల మూటగా... మమ్మల్లిన చిట్టితల్లీ...
ముద్దు-ముద్దు పలుకులతో...
మురిపించిన. మా ముద్దుల మూటా...
నీ చిన్ని చేతుల్లో రంగుల గొడుగులు ...
నీ తేనె కళ్ళలో నిండైన కలలు
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
కన్నీటి మధ్య నవ్వులు చిందే...
చెరగని మోమే నీ సంతకం
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
పతితో ఏడడుగులు నడిచిన గురుతే నిన్నగా
పెళ్ళిపెద్దలై దీవెనలిస్తుంటే సరికొత్తగా
ఆదిదంపతుల రూపంగా ....
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
అందాల నా తల్లి
నీ కలలు పండిన ఈ వేళ...
మా మది పలుకుతున్నది ....
నీ జీవితం పూలవనంలా వికసించాలని...
నీ భవిత అంతా సంతోషాల సంగమం కావాలని
మమతల పొదరిల్లే మా తల్లి
నీ చెంతే మా హృదయాలు,
బంగారుతల్లీ...ఎప్పటికీ నీతోనే...
ఓ మా చిట్టి చిలుకమ్మ...
పూల తోటలా పూసిపో...
సంతోషాల పూతోటలో
ధీర్ఘ సుమంగళీభవ...శతమానం భవతీ...
***
(నెల క్రితం జరిగిన మా మనవరాలి పెళ్ళిలో, కన్యాధార చేస్తున్న మా అమ్మాయిని చూస్తుంటే నా మదిలో ఏర్పడిన భావాలకు అప్పటికప్పుడు, వ్రాసుకున్న భావాలు. అవి AIతో పాడించి, చిత్రీకరించి నా ఛానల్ లో పొస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూర్తిగారి ఈ చిత్రం చూడగానే గుర్తు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు, నా ప్రభాతకమలం ఛానల్ లో AI పాడిన పాటను, అందమయిన దృశ్యరూపములో చూస్తూ వినవచ్చు.)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి