27, డిసెంబర్ 2019, శుక్రవారం

మహానటి సావిత్రి


భాషకు అందని మహానటి సావిత్రి యుక్త వయస్సులో .. నా పెన్సిల్ చిత్రం 


ఆమె గురించి శ్రీ ఆచారం షణ్ముఖాచారి గారు సితార పత్రికలో ఏమంటున్నారో  క్రింది లింకు క్లిక్ చేసి  చదవండి.

https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/savitri-gemini-ganeshan-brahuttaru/16814

15, డిసెంబర్ 2019, ఆదివారం

పొట్టి శ్రీరాములు

Pencil sketch by me

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల
~ సామవేదం జానకిరామ శర్మ

13, డిసెంబర్ 2019, శుక్రవారం

గొల్లపూడి మారుతీరావు


నా pencil sketch

గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019) రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రీయల్లో ఆరితేరిన వారు, బహు కొద్దిమందే మనకి సాక్షాత్కరిస్తారు. అందులో నిన్నటి తరం వారికి ప్రతినిధిగా, నేటి తరం వారికి మార్గదర్శకులుగా, రేపటి తరం వారికి దిక్సూచి గా, తరతరాలు నిలిచిపోయే రచనలు అందించినవారు, తన ఆపారమైన విషయ పరిఙ్ఞానం జోడించి తన వాక్ధాటితో ప్రేక్షకులను రంజింపచేయగల మేధావి, ఆబాలగోబాలాన్ని ఆకట్టుకునే విలక్షణ నటుడు, ఎనభై వసంతల వయసులో కూడా ఇటు విశ్లేషణలు నుంచి, అటు సీరియళ్ల వరకు, అన్ని సాహితి ప్రక్రియలకు చిరునామాగా వాసికెక్కిన ప్రతిభాశాలి, మన తెలుగువెలుగుకి నిలువెత్తు నిదర్శనం శ్రీ గొల్లపూడి మారుతీరావు గారే!

డిసెంబర్ 12, 2019 నాడు స్వర్గస్తులైన గొల్లపూడి మారుతీరావు గారికి నా pencil చిత్రం ద్వారా శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.

1, డిసెంబర్ 2019, ఆదివారం

కలకంఠి నీ కంట - కవిత

అలనాటి బాపు గారి నలుపు తెలుగుల చిత్రాన్ని తిరిగి చిత్రించి రంగులద్దిన బొమ్మ ఇది.. అప్పటి రోజుల్లో పత్రికల్లో పత్రికల్లో రంగుల ముద్రణ లేదు. నా చిత్రానికి శ్రీమతి  గుడిపూడి రాధికా రాణి గారి కవిత.                    కలకంఠి నీకంట
కన్నీరు రానీను
గుండెలో నీకొరకు
గూడొకటి కట్టాను

అరికాలు కందకనె
అబ్బురముగా చూతు
నీకాలిలో ముల్లు
నిలువునా నను చీల్చు

జాగుసేయక నేను
జాగ్రత్తగా తీసి
అపురూపముగ నిన్ను
అక్కునను జేర్చుకొన

నీకాలియందియలు
నీ మెట్టె సవ్వడులు
నిలువెల్ల మదినిండె
నినువీడి మనలేను
*********************
(**ఇష్టపదులు**
 గుడిపూడి రాధికారాణి.
శీర్షిక:రాధాగోపాళం
తేది:1.12.2019
ఇష్టపది సంఖ్య:236)
**********************

24, నవంబర్ 2019, ఆదివారం

మనసు కవి 'ఆచార్య ఆత్రేయ'


ఆచార్య ఆత్రేయ 

క్లుప్తంగా ఇక్కడా అక్కడా నేను సేకరించిన వివరాలతో నా పెన్సిల్ చిత్రం 

'ఆత్రేయ' అసలు పేరు కిలంబి నరసింహాచార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరలోని మంగళంపాడు గ్రామంలో  జన్మిచారు. గోత్రనామం ఆత్రేయతో అందరికీ సుపరిచితులు.   నాటక రచయితగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సినిమా రచయితగా జనం గుండెల్లో నిలిచిపోయారు.

దీక్ష సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు. దాదాపు 1400 సినిమాలకు పాటలు రాశారు. మనసుమీద పాటలు రాసి 'మనసుకవి'గా ప్రసిద్ధికెక్కారు. ఎంజీవో, విశ్వశాంతి, కప్పలు, వాస్తవం, లాంటి గొప్ప నాటకాలు అనేకం రాశారు.

ఇంకా టూకీగా వారు రాసిన పాటల గురించి :

‘‘మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ (ప్రేమనగర్‌), ‘‘మనసు లేని బతుకొక నరకం మరపులేని మనసొక నరకం’’ (సెక్రటరీ),  ‘‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!’’ (ప్రేమలు-పెళ్లిళ్లు) ఇలా ఎన్నో పాటల్లో మనిషికి మనసెంత ముఖ్యమో, కానీ ఆ మనసున్న మనిషి ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఆత్మీయంగా, అనుభవైకవేద్యంగా చెప్పారు ఆత్రేయ. మనసెంత చంచలమైనదో, మాయలాడో- అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో విశ్లేషించిన ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికవేత్తలా అనిపిస్తాడు.‘‘కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!’’ (గుప్పెడు మనసు ) అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి తల పట్టుకున్న ఆత్రేయ మరో సందర్భంలో మనసు నిత్యమనీ, అది జన్మజన్మల బంధమనీ భావించారు.‘‘మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలిసిపోతది ’’(మూగ మనసులు)

ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13న స్వర్గస్తులయ్యారు. 

8, అక్టోబర్ 2019, మంగళవారం

భార్య దైవకమైన చుట్టము


'ఈనాడు' సంపాదకీయంలో ఓ extract కి నా బొమ్మలు జోడించాను.

‘మా ఆవిడకు మంత్రాలొచ్చు’ అన్నరు తణికెళ్ళ భరణి తన పరికిణీ కవితలో. ‘ఏడ్చే పసివాడికి పాలసీసా అయిపోతుంది. అత్త్తగారి నడ్డికింద పీటయిపోతుంది. పడగ్గదిలో రాత్రి నాకు రగ్గవుతుంది.. వాకిట్లో పొద్దున్నే ముగ్గవుతుంది’. ఇన్ని రకాల అవతారాలు ఎత్తాలంటే ఆమెకు మంత్రాలు వచ్చే ఉండాలన్నది బలమైన తర్కం. చమత్కారం సంగతి అలా ఉంచి, ఒక ఇల్లాలు నిజజీవితంలో ఎన్ని రూపాలు ధరిస్తుందో, ఎన్నెన్ని పాత్రలు పోషిస్తుందో.. ఆ కవిత స్పష్టం చేస్తోంది. ‘విమల చారిత్రశిక్షకు ఆచార్యశకంబు, అన్వయస్థితికి మూలంబు, సద్గతికి ఊత…’ చక్కని నడవడిని నేర్పుతూ, వంశాంగత కీర్తిప్రతిష్టలను కాపాడుతూ, ఇహపరాల్లో ఉత్తమ గతులకు కారణమయ్యేది ధర్మపత్ని మాత్రమేనంది మహాభారతం. ఒక్కరోజు వంటిల్లు తనమీద వదిలేసిపోతే కాళ్ళుచేతులు ఆడవని, ఇల్లాలు లేకుండా ఇల్లు గడవదన్నది ప్రతి పురుషపుంగవుడికీ అనుభవమే! స్త్రీలేని ఇల్లు ఎలా ఉంటుందో చెపుతూ భాస్కర రామాయణం ‘నలిన సంతతి లేని కొలని కైవడి (పద్మాలు లేని సరస్సులా) రేయి దీపిక లేని మందిరము పగిది (దీపం లేని దీనమందిరంలా) శూన్యంగా తోస్తాయి’ అంది. కాబట్టే ‘భార్య దైవకమైన చుట్టము.. దేవుడిచ్చిన బంధువు’ అన్నాడు ధర్మరాజు- యక్ష ప్రశ్నల్లో. ‘ కళింగరాజ్యంలో మధురవాణి లేకుంటే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండేది!’ అంటాడు కన్యాశుల్కంలో కరటకశాస్త్రి. గురజాడ కనుక మధురవాణిని ఇంత గొప్పగా సృష్టించకుంటే, ఆ నాటకానికి ఎంత లోటు కలిగేదో భగవంతుడు స్త్రీని పుట్టించకుంటే ఈ సృష్టి శూన్యమై మిగిలేది. (ఆదివారం 6.9.2019 'ఈనాడు' సంపాదకీయం సౌజన్యంతో)

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...