14, జనవరి 2024, ఆదివారం

నీ నవ్వుల జల్లులతో వచ్చెనులే సంక్రాంతులు - గజల్


మిత్రులు శ్రీ Madhav Rao Koruprolu  గారు ఈ చిత్రానికి రచించిన అద్భుతమైన గజల్. వారికి నా ధన్యవాదాలు.


ఆత్మీయ మిత్రులు నిరుపమ చిత్రకారుడు మాన్యశ్రీ Pvr Murty గారికి అంకితంగా.. 🌹🙏🌹🌹🙏🌹👍💖😊😊💖🦜

5644..గజల్ 


నీ నవ్వుల జల్లులతో..వచ్చునులే సంక్రాంతులు..! 

నీ వలపుల కళకళతో..వెలుగునులే సంక్రాంతులు..! 


నీ సిగ్గుల గంధమెంత..మనోహరమొ ఏంచెప్పను.. 

నీ తలపుల వెన్నెలతో..పొంగునులే సంక్రాంతులు..!


ఆకుపచ్చ సోయగాల..పసిడిరాశి నీవె చెలీ.. 

నీ వాడని సొగసులతో..పండునులే సంక్రాంతులు..! 


నిత్యపూర్ణ మకరరాశి..నీతోడుగ ఉన్నదిలే.. 

నీ అందెల సడిసాక్షిగ..పాడునులే సంక్రాంతులు..! 


మరువతగని పారిజాత..గంధరాశి నీ మనస్సు.. 

నను వీడక అలరించగ..చూడునులే సంక్రాంతులు..! 


నిజతులసీ వనసీమవు..నీవన్నది రుజువైనది.. 

పవిత్రతా పవనాలను..పంచునులే సంక్రాంతులు..! 


మాధవ గజలై విరిసే..'మూర్తి'మత్వ తేజోనిధి.. 

'పీవియారు'చెలికన్నుల..నింపునులే సంక్రాంతులు..!

9, జనవరి 2024, మంగళవారం

పైడి జయరాజ్ - అద్భుత నటుడు


 పైడి జైరాజ్ - అద్భుత నటుడు (pencil sketch) 


చాలామంది తెలుగు వారికి తెలియని  ఓ గొప్ప  తెలుగు  నటుడు పైడి  జయరాజ్. కరీంనగర్ లో జన్మించిన జయరాజ్ సినిమా అవకాశాలు కోసం ముంబై వెళ్లి హిందీ మరాఠీ చిత్రాలలో బాగా రాణించాడు. తొలినాటి మూక సినిమాలతో నట జీవితం ప్రారంభించాడు.

చారిత్రాత్మక పాత్రలకు పెట్టింది పేరు జయరాజ్. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందాడు. మరిన్ని వివరాలు క్రిందన పొందుపరుస్తున్నాను.


Paidi Jairaj (born 28 September 1909 – 11 August 2000) was an Indian actor, director and producer known for his works majorly in Hindi; few Marathi, Gujarati,  and Telugu theatre. ] During the talkie period, from 1931 onwards, he started with Shikari in Urdu and English languages. Subsequently, he became one of the leading actors for about two decades, along with V. Shantaram, Ashok Kumar, Prithviraj Kapoor, Motilal etc. He starred in about 170 feature films in a variety of roles. He directed a few films such as Mohar, Mala (1943), Pratima, Rajghar and Saagar (1951), which he produced. In 1980, he was awarded with the Dadasaheb Phalke Award, the highest award for films in India, for his contributions to Indian cinema.


(Courtesy: Wikipedia)

7, జనవరి 2024, ఆదివారం

బుజ్జాయి


బుజ్జాయి -  కలం చిత్రం

ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు, రచయిత 'బుజ్జాయి'. అసలు పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి.


వీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931లో జన్మించారు. బుజ్జాయి గారిని కృష్ణశాస్త్రి గారు అందరిలా పాఠశాలకు పంపకపోవడంతో, ఆయనకి సంప్రదాయ పద్ధతుల్లో విద్యాభ్యాసం జరుగలేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. 


 శ్రీశ్రీ, విశ్వనాథ సత్యన్నారాయణ వంటి కవుల, రచయితల, యితర ప్రముఖులతో ఆయన తన అనుభవాలను "నాన్న-నేను" అనే పుస్తకంలో కథలుగా వివరించారు. పంచతంత్ర కామిక్స్ ను మొట్టమొదట ఆంగ్లం లో ఆయన రాసారు.


17 సంవత్సరాల వయసులో బుజ్జాయి "బానిస పిల్ల" అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. లక్షలమందిని ఆకట్టుకున్నారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ఆయన డుంబు, భైరవ్, పెత్తందార్ కామిక్ స్ట్రిప్పులను వేసారు.


91 యేళ్ళ వయసులో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి వృద్ధాప్య సమస్యలతో పాటు కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతూ 27 జనవరి 2022న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు.

4, డిసెంబర్ 2023, సోమవారం

త్రిపురనేని గోపీచంద్


త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch 

త్రిపురనేని  గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, మనో వైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు.

30, నవంబర్ 2023, గురువారం

మాదిరెడ్డి సులోచన


 

మాదిరెడ్డి సులోచన, ప్రముఖ రచయిత్రి - charcoal pencil sketch

ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల వ్రాసింది. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రచించింది. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని.

1935లో రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ గ్రామంలో జన్మించిన ఈమె  1984లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో మరణించింది.

26, నవంబర్ 2023, ఆదివారం

గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకుడు



గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు) (1903 - 1964).

Charcoal pencil sketch 


తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు, పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి, చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.


1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం.


1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు. ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - తెరతీయగరాదా దేవా ఆలాపించారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.


1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరామా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే.


ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి.  ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964  పరమపదించారు.


(ఇక్కడ అక్కడ చదివి సేకరించిన వివరాలు ఆధారంగా నేను చిత్రీకరించుకున్న నర్సింహారావు గారి చిత్రం తో ఈ పోస్టు)

11, నవంబర్ 2023, శనివారం

చంద్రమోహన్ - అద్భుత నటుడు



అద్భుత నటుడు చంద్రమోహన్ - నా చిత్ర నివాళి (pen and ink sketch)

తెలుగు చిత్రసీమ ఓ అద్భుత నటుణ్ణి కోల్పోయింది.  వికీపీడియా సౌజన్యంతో వారి గురించి టూకీగా వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ (సినిమా)లో నటించాడు.

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...