8, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీరంగం నారాయణబాబు - రచయిత



శ్రీరంగం నారాయణబాబు - రచయిత - my charcoal pencil sketch

వీరు విజయనగరంలో, 1906, మే 17వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు.

నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.


వీరు 1961, అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు.


సౌజన్యం : వికీపీడియా 

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

పొణకా కనకమ్మ


charcoal pencil sketch


పొణకా కనకమ్మ (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక.{ఈమె జననం-1892, జూన్ 10 - మరణం 1963 సెప్టెంబరు 15}. ఈమె అమ్మమ్మ ఇంట నెల్లూరు జిల్లా మినగల్లులో 1892 జూన్ 10 న జన్మించింది. బాల్యంలో చదువుకోలేదు. నెల్లూరుకు చెందిన మరుపూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ . తనతో పాటు తన కుటుంబం మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో అక్తొబరు 18 న, విజయదశమిరోజున కస్తూరీదేవి బాలికా పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో ఎంతో కృషి చేసింది. రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపింది.

courtesy - wikipedia

1, ఫిబ్రవరి 2024, గురువారం

మండపాక పార్వతీశ్వర శాస్త్రి

మండపాక పార్వతీశ్వర శాస్త్రి
(Charcoal pencil sketch)

మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 30, 1833 - జూన్ 30, 1897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.

వీరు విజయనగరం జిల్లా , బాడంగి మండలం లోని పాల్తేరు గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30 తేదీన జన్మించారు. ఈయన వేగినాటి వైదిక బ్రాహ్మణుడు, ఆపస్తంబ సూత్రుడు, పారాశర గోత్రుడు. ఇతని తండ్రి మండపాక కామకవి, తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. వీరు 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అచటనే ఉన్నారు. 

నోరి నరసింహశాస్త్రి




నా charcoal pencil చిత్రం. 


నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.  

సౌజన్యం: వికేపీడియా

25, జనవరి 2024, గురువారం

రామానంద్ సాగర్

 రామానంద్ సాగర్ (నా pencil చిత్రం)



రామానంద్ సాగర్ ప్రముఖ నిర్మాత,  దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలు ఇతని దర్శకత్వంలో వచ్చాయి. 

వీరు నిర్మించిన  రామాయణ్ మెగా TV  సీరియల్  అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం ఈ సీరియల్ దూర్ దర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యేది.  యావత్ భారత దేశంలో ఆదివారం నాడు రోడ్లు ఖాళీ.  భారతీయులకు రామాయణ కావ్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమైన ఈ కార్యక్రమం నిరూపించింది.

అయోధ్యలో రామాలయం పునర్ నిర్మాణం సందర్భంగా ఆ రోజులు గుర్తుకొచ్చాయి. 





17, జనవరి 2024, బుధవారం

జానీ లీవర్‌ - ప్రముఖ హాస్య నటుడు


 చాలా మంది తెలుగువారికి తెలియని తెలుగు వాడు,ప్రముఖ హాస్య నటుడు, జానీ లివర్. ఓ ఆగ్రశ్రేణి హాస్య నటుడు, హిందీ చిత్ర సినిమాలో రాణించాడు. (My charcoal pencil sketch) 


Johnny Lever is a renowned Indian comedian and actor known for his exceptional comic timing. With a career spanning decades, he has contributed significantly to the Indian film industry. Lever's versatility and ability to bring humor to diverse roles have earned him widespread acclaim.


Johnny Lever was born on August 14, 1957, in a Telugu Christian family in Kanigiri, Andhra Pradesh, India. His birth name is John Prakash Rao Janumala. Lever has indeed acted in a substantial number of films, showcasing his comedic talent across various genres in the Indian film industry

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...