31, డిసెంబర్ 2015, గురువారం

కొంగర జగ్గయ్య - నివాళి


ఈ రోజు (31 December)  కొంగర జగ్గయ్య జయంతి. ఆ మహానటునికి, బహుముఖ ప్రజ్ఞాశాలి కి నివాళి.
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.

30, డిసెంబర్ 2015, బుధవారం

Appu Chesi Pappu Koodu || Moogavaina Emi Full Video Song || NTR, Savitri...





జగ్గయ్య గారి జయంతి సందర్భంగా ఈ చక్కని సన్నివేశం, పాట ఓసారి స్మరించుకుందాం.

చిత్తూరు నాగయ్య - పెన్సిల్ చిత్రం


తెలుగు వెండితెర తొలి సూపర్ స్టార్, బహుముఖ ప్రజ్ఞాశాలి, చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి నేడు. ఆ మహా వ్యక్తికి నా స్మృత్యంజలి.

28, డిసెంబర్ 2015, సోమవారం

పింగళి నాగేంద్రరావు - నివాళి


పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా నా నివాళి. వీరు ఒక తెలుగు సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. వీరు ఒక రచయితగా తెలుగు సినీ రంగానికి చేసిన సేవ ఎంత విశిష్టమయినదో ఈ క్రింది చిత్రాలే చెబుతాయి.
రాజకోట రహస్యం (1971) గీతరచన
అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
సి.ఐ.డి (1965) (రచయిత)
శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
జగదేకవీరుని కథ (1961) (రచయిత)
మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
మిస్సమ్మ (1955) (రచయిత)
చంద్రహారం (1954) (రచయిత)
పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
భలే పెళ్లి (1941) (గీతరచన)
శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).
(సేకరణ: వికీపీడియా)

23, డిసెంబర్ 2015, బుధవారం

మహమ్మద్ రఫీ - నివాళి - పెన్సిల్ చిత్రం

భారతదేశ ప్రజలకు పరిచయం అవసరంలేని అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీ. చిన్నతనంలో ఫీకో గా పిలవబడిన రఫీ ఓ ఫకీరు వీధుల్లో తిరుగుతూ పాడుకునే పాటలను అనుకరించేవాడు. తన స్నేహితుడు ప్రోద్బలంతో ముంబాయి వచ్చి అక్కడే గాయకుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 'సోనియేనీ హీరియెనీ' అనే ఓ పంజాబీ గీతాన్ని   జీనత బేగం తో కలసి 'గుల్ బలోచ్' అనే పంజాబీ చిత్రంలో తొలిసారిగా ప్లేబాక్ గాయకుని గా పాడడం ప్రారంభించాడు. తొలిసారిగా  హిందీ లో 'గాంవ్ కీ గోరీ' అనే చిత్రంలో 1945 సంవత్సరంలో ఓ పాట పాడాడు. ప్రేమ గీతాలు, ఆవేదనాభరిత గీతాలు, భక్తి గీతాలు, ఎన్నో యుగళగీతాలు పాడి  'నభూతో నభవిష్యతి' అని అనిపించుకున్న ఈ మహాగాయకుని జయంతి సందర్భంగా నా ఘన నివాళి.

పి. భానుమతి - పెన్సిల్ చిత్రం


భానుమతి, ఎన్టీఆర్ నటించిన 'సారంగధర' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. సారంగధరుని వర్ణిస్తూ ఆమె పాడిన ఈ అద్భుత గీతం, అంతకు తగ్గటుగా ఠీవి, దర్పం తో నడచి వస్తున్న ఎన్టీఅర్, ఈ పాట చిత్రీకరణ వెరసి  నభూతో నభవిష్యతి అనిపించాయి. భానుమతి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు నా నివాళి.

21, డిసెంబర్ 2015, సోమవారం

ఈనాటి అమ్మాయి - పెన్సిల్ చిత్రం


మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు 

కందము.

నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
"
సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.

18, డిసెంబర్ 2015, శుక్రవారం

టిఫిన్ సెంటర్లు కర్రీ పాయింట్లు - కార్టూన్


గుండమ్మ కధ - సూర్యకాంతం



ప్రధాన పాత్రధారుల ఫోటోలు లేకుండా, ఓ గయ్యాళి పాత్ర పోషించిన సూర్యకాంతం గారి ఫోటో మాత్రమే పొస్టర్ మీద వేసి విడుదల చేసిన ఇటువంటి తెలుగు సినిమా ఇంకోటి లేదేమో .. ! అంతేకాదు సినిమా title కూడా ఆ పాత్ర పేరుమీదే ఉంది. విడ్డూరం కాదూ..? అయితే దీని వెనుక కూడా ఓ కధ ఉందట. సినిమా పేరు నిర్ధారణ చెయ్యకుండా చిత్రీకరణ ప్రారంభించారట. అయితే నిర్మాత గారి శ్రీమతి గారు 'మీ గుండమ్మ కధ' ఎంతవరకూ వచ్చింది అని అడిగారట. నిర్మాత గారికి స్పార్క్ లా వెలిగి అదే పేరు స్థిరీకరించారు. The rest is history.


16, డిసెంబర్ 2015, బుధవారం

మూసిఉన్న రెప్పలలో మూగబాసలు


ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి శశికళ ఓలేటి గారి ఈ బొమ్మ కి facebook లో తన చక్కటి కవిత ద్వారా ఇలా స్పందించారు.

-వాల్చి యున్న రెప్ప వెనుక
వాల్కెనో లెన్నెన్నో.
-
మూసి వున్న కళ్ళల్లో,
మూగ భావా లెన్నెన్నో.
-
బిగి నున్న పెదవు లందు,
బిడియపు నిభిడీ కృతా లెన్నెన్నో. 
-
విర బోసిన కురులలో,
అర విరిసిన విరులెన్నో,
తెర లేసిన కన్నేరు లెన్నో.
ఎన్నో ఎన్నో కలబోసిన ఊహల,భావాల, సోయగాల, శోకాల,విరహాల, విషాదాల, సుఖాల,
సుమాల,వియోగాల, కలయికల, మౌనాల, మంజు వాణి స్వరాల, రాగాల, విరాగ సరాగ సంగీత, సాంత్వనోద్దీపిత దీప కళిక కదా ఆమె.!!!!! ఆమె ఒక

కృష్ణమూర్తి బొల్లు గారు facebook లో ఇలా స్పందించారు.
     
మనోభావనల మాధుర్యాలను
అనుభవి౦చి ఆన౦ది౦చిన కరము
నర్తి౦చెను..చి(తలేఖనా శిల్పము నెఱిగి

మౌనమైన మానిని మానసును తెలుపుచు

14, డిసెంబర్ 2015, సోమవారం

బాపు చిత్రాలు - ఓ ప్రేరణ


బాపు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి బొమ్మల ప్రేరణ తో నా కుంచె/పెన్సిల్ తో వేసిన చిత్రాల వీడియో - తిలకించండి.
ధన్యవాదాలు.

9, డిసెంబర్ 2015, బుధవారం

ప్రౌఢ - తెలుగింటి ఆడపడుచు - పెన్సిల్ చిత్రం






ఆటవెలది.

చిరు నగవుల చాటు చింత దాచు కునేను, మధ్య తరగతి వెత మదిని ముడిచి. ప్రౌఢ మోము లోని పౌరుషమ్మది గన! ఇంతి కాంతి చూడ ఇంటి దివ్వె!!!

- శ్రీమతి ఓలేటి శశికళ గారి పద్యం - వారికి నా ధన్యవాదాలు.

8, డిసెంబర్ 2015, మంగళవారం

కన్నె వయసు లో షర్మీలా టాగోర్ - పెన్సిల్ చిత్రం


షర్మీలా టాగోర్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఈమె నటించిన తొలి చిత్రం 'అపూర్ సంసార్'. విశ్వ విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ ఈ చిత్రంలో ఈమెను పరిచయం చేసారు. అప్పటికి ఈమె వయసు పదిహేను సంవత్సరాలు మాత్రమే. అప్పటి ఫోటో చూసి ఇష్టపడి ఈ బొమ్మ చిత్రీకరించాను.

ఈ బొమ్మ చూసి తన పద్యం ద్వారా మిత్రులు రాజేందర్ గణపురం గారు ఇలా స్పందించారు. వారికి నా ధన్యవాదాలు :

సీ॥నిలువుటద్దము ముందు।నిలబడి వనితలు సవరింతురు కురుల।సంబ రంగ పొడిపొడి తుంపర్లు।పడిపడి జారంగ పొడితుండు గుడ్డతో।తడిని దీసి తలకంటు తైలము।మిలమిల మెరియంగ ఈర్పెనతో దూసి।ఇంపు జేసి పైనొక దానిపై।పాయలను గలిపి అల్లి బిల్లిగనల్లు।నతివ తాను ఆ॥పూల దండ మొదట।ముచ్చటన్ గొలుపంగ చూడ ముచ్చటేయు।సుదతి జడను నర్సపురని వాస।నటరాజ గణమోక్ష విశ్వ కర్మ రక్ష।వినుర దీక్ష


7, డిసెంబర్ 2015, సోమవారం

6, డిసెంబర్ 2015, ఆదివారం

మహానటి సావిత్రి - ఆటవెలది పద్యాల రచన శ్రీమతి శశికళ వోలేటి



ఆటవెలదులు::::::

1.పల్లవించె నచట పావురమును బ్రోలు,
పంచ వన్నె చిలుక వగలు లొలక.
సీమ మరచి పోయె సినిమా ప్రపంచము,
ఎల్ల లెరుగ నికళ లెంచ జూడ.
2. రాజ్ఞి వోలె నేలె రస రమ్య నటనతో,
రాశి పోసిన సొగసు రాచ జన్మె.
రారు ఎవరిక సరి, 'రావు'లందరి సిరి.
నవ రస ముల కెలవు నవ్వు మోము.
3. అన్య భాష లందు అన్నన్ని పాత్రలు,
ఆమె కొరకె వ్రాయ యలసి పోయె.
విధికి కన్ను గుట్టె వేదన మొదలాయె.
మధువు నాశ్రయించె మనసు కుదుర.
4. చేతి కెముక లేక చేజారె కృషియంత,
నటియె కాదు వితరణ మదె గనుమ.
వెలుగు నీడల బ్రతుకు న్వెలసి పోయె వెలుగు.
జాతి కొదలి పోయె చాల చరిత్ర.
5. కులుకు మిస్సు, చూడు గుండమ్మ కూతురు.
మాయ శశిగ మనల మాయ జేయు.
నవ రసము లను గను నవరాత్రి యందునా,
నటనకు చిరు నామ నాయి కామె.
6. వెండి తెరల పైన మెండైన నాయకీ
కండ్ల బాస తోనే కలలు రేపె.
కల్ల లాయె గాద కలహంస కలలన్ని
నేడు, నాడు, రేపు నెపుడు నామె!!!
7. కోట్ల జనుల మదిని కొల్ల గొట్టి యిలను,
సావిత్రి ముద్ర కైవ సమును కాగ,
ముద్దు లొలుకు ముదిత మోము మరవ లేము.
చలన చిత్రము చివరి ఛాయ యామె.
- శశికళ వోలేటి

5, డిసెంబర్ 2015, శనివారం

ఘంటసాల - ఆదిభట్ల నారాయణదాసు - కళావర్ రింగ్


అమర గాయకుడు ఘంటసాల గారి గురించి, హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి తెలుగు వారందరికీ తెలిసిందే. కాని విద్యార్ధి దశలో ఘంటసాలను ఆదరించిన 'కళావర్ రింగ్' గురించి చాలామందికి తెలియదు. ఆమె గురించి టూకీగా తెలుసుకుందామా..
పాటకత్తెగానూ, ఆతక్త్తెగానూ ప్రశస్తి గాంచిన 'కళావర్ రింగ్.'
కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజ నర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసిన కళాకారిణి కళావర్ రింగ్ అనే పేరుతో చెలామణి అయిన అయిన శ్రీమతి సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొంద గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విదాభ్యాసం చేసి శ్రీ మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, శ్రీ ద్వారం వెంకతస్వామి నాయుడు శిష్యులైన శ్రి మద్దిల సత్య మూర్తి, శ్రీ చాగంటి రంగ బాబు, శ్రీ కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం నాయకురాలుగా వ్వవహరిందింది. ఆమే నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.

30, నవంబర్ 2015, సోమవారం

అద్భుత అమెరికా రచయిత Mark Twain - పెన్సిల్ చిత్రం


తెలుగులో నిర్మించిన అలనాటి  అద్భుత చిత్రం 'రాజూపేద' Mark Twain నవల 'The Prince and Pauper' ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రంలో ఎన్టీఅర్ పోషించిన పాత్ర నభూతో నభవిష్యతి గా ఉంటింది. ఎన్నో చిత్రాల్లో పౌరాణికి పత్రాలు, అందాల రాజకుమారుడు పాత్రలు పోషించిన ఎన్టీఅర్ ఈ చిత్రంలో ఓ rugged పాత్ర ని అద్భుతంగా పోషించారు. 

19, నవంబర్ 2015, గురువారం

ప్రపంచ తెలుగు ప్రదర్శనశాల, కైలాసగిరి, విశాఖపట్నం


ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రపంచ తెలుగు ప్రదర్శన శాల ప్రారంభోత్సవం నిన్న విశాఖపట్నం, అందాల  కైలాసగిరి పై గౌ. ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరగడం, ఆనందం .. మహదానందం. ఈ ప్రదర్శన శాల ప్రఖ్యాత కళా దర్శకులు తోట తరణి గారు రూపొందించారు.

23, అక్టోబర్ 2015, శుక్రవారం

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

అమర గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి - పెన్సిల్ చిత్రం


అమర గాయని  ఎమ్మెస్ సుబ్బలక్ష్మి శతజయంతి సంవత్సరం సందర్భంగా నేను  వేసుకున్న పెన్సిల్ చిత్రం.

నా facebook స్నేహితురాలు శ్రీమతి శశికళ ఓలేటి గారు నేను వేసిన బొమ్మకి తన ఆటవెలది పద్యంతో ఇలా స్పందించారు.



ఆ.వె లక్ష్మి పేరు నందు లలితము గ పొదగ, శారదాయె తాను సంగితమున, పార్వ తదియె గాద పరమ శివుని బొంద, ముగ్గు రమ్మల కళ ముఖము నందు. *************** 2. పంచ రత్న కృతుల పాడు భరత రత్న. అమృత భాండ మదియె యలరు స్వరము. వాణి గాత్ర మివ్వ, వాగ్గేయ కారుల కృతులు పాడె జనుల శ్రుతులు మీట. ,**************
,

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఆశా భోంస్లే - నా పెన్సిల్ చిత్రం.


మధురగాయని ఆశా భోంస్లే పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. ఓపి నయ్యర్ సంగీత దర్సకత్వంలో ఈమె పాడిన పాటలు అద్భుతం.

20, ఆగస్టు 2015, గురువారం

పెన్ స్కెచ్


పెన్ స్కెచ్ - సినీ దర్శకుడిగా  చరిత్ర సృష్టించిన సత్యజిత్ రాయ్ మంచి చిత్రకారుడు కూడా. ఆయన శైలి లో నేను పెన్ తో వేసిన బొమ్మ.

18, ఆగస్టు 2015, మంగళవారం

7, ఆగస్టు 2015, శుక్రవారం

పెన్సిల్ చిత్రం


విదేశీ అమ్మాయి ఫోటో ని భారతీయ అమ్మాయి గా వేసుకుంటే ఎలాగుంటుంది అనిపించి చేసిన ప్రయోగం - పెన్సిల్ చిత్రం

28, జులై 2015, మంగళవారం

భారత రత్న అబ్దుల్ కలాం - పెన్సిల్ చిత్రం


దివినుండి  భువికేగిన భరత జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం -  నా పెన్సిల్ చిత్రం

18, జులై 2015, శనివారం

రాజేష్ ఖన్నా - పెన్సిల్ చిత్రం


ఈ రోజు భారత దేశపు తొలి సూపర్ స్టార్ గా పేరొందిన అద్భుత నటుడు రాజేష్ ఖన్నా వర్ధంతి. ఆ మహా నటునికి నా ఘన నివాళి.

14, జులై 2015, మంగళవారం

NT RAMA RAO - తోడుదొంగలు చిత్రంలో - పెన్సిల్ చిత్రం


1954 సంవత్సరంలొ తన స్వంత banner మీద నిర్మించిన చిత్రం 'తోడుదొంగలు'. కాని ఈ చిత్రం బహుముఖ ప్రశంసలు అందుకున్నా ఆర్ధికంగా విజయం సాధించలేదు. నిరాశ చెందిన రామారావు గారు 'ఇంక జనానికి నచ్చే చిత్రాలే నిర్మిద్దాం' అని నిర్ణయం తీసుకున్నారు. 'హిందూ' దినపత్రికలో ఈ చిత్రం పై వచ్చిన వ్యాసం ఈ సినిమా గురించి తెలియజేస్తుంది.


తోడుదొంగలు' చిత్రంలో ఎన్టీఆర్ - నా పెన్సిల్ చిత్రం. హిందూ పేపర్లొ ఈ చిత్రం పై వచ్చిన వ్యాసం లింకు ఇదిగో : http://www.thehindu.com/…/thodu-dongalu-…/article5717347.ece

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...