28, సెప్టెంబర్ 2016, బుధవారం

హైదరాబాద్ నగరంలో వరదలు - నా cartoon


ఇటీవల రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయమయ్యింది. ఈ సందర్భంగా నేను వేసిన ఈ కార్టూన్ కి  facebook లో విశేష ఆదరణ లభించింది.

మహాకవి జాషువా - పెన్సిల్ చిత్రం - Jashuva - Pencil sketch

నేడు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా వారికి నా నివాళి.
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. (వికీపీడియా)

ఈ సందర్భంగా 'ఈమాట' అంతర్జాల పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదివి జాషువా గారి కొన్ని మచ్చుతునక పద్యాలు చదువుదాం, ఘంటసాల గారు వాటిని స్వరపరచి ఎంత అద్భుతంగా గానం చేసారో విని తరిద్దాం. దయచేసి ఈ క్రింది లింకు క్లిక్ చెయ్యండి. ఇంత చక్కని వ్యాసం అందించిన శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

http://eemaata.com/em/issues/200909/1464.html


15, సెప్టెంబర్ 2016, గురువారం

గృహిణీ గృహముచ్యతే - Pencil Sketch - శ్రీమతి ఉమాదేవి జంధ్యాల గారి కవిత

నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి ఉమాదేవి జంధ్యాలు గారు వ్రాసిన కవిత (గజల్). వారికి నా ధన్యవాదాలు.

।।గృహిణీ గృహముచ్యతే।। ఉమాదేవి జంధ్యాల
--------------------------------------------
చీకటినే తొలగించే ఉదయానివి నువ్వేగా
మేలుకొలుపు సుప్రభాత గీతానివి నువ్వేగా!
కనుతెరువగ కమ్మనినీ నగుమోమే చాలునులే
కనుపాపగ మముకాచే దైవానివి నువ్వేగా!
గడియారంతోపోటీ పడుతుంటావేరోజూ
అలుపెరుగక తిరుగాడే కాలానివి నువ్వేగా!
ఏదెక్కడ పెట్టామో తెలియదుమా కెవ్వరికీ
చేతిలోకి వస్తుందను ధైర్యానివి నువ్వేగా!
కరిగిఅరిగి పోతున్నా కనిపించదు మాకళ్ళకు
అద్దంలా యిల్లుంచే పనిమనిషివి నువ్వేగా!
ఎనిమిదికాకుండానే అందరికీ తొందరలే
పదిచేతుల పనిచేసే యంత్రానివి నువ్వేగా!
నీచల్లని చేయితాక మాయమౌను రుగ్మతలే
ఒడినిజేర్చి ఓదార్చే దయామయివి నువ్వేగా!
సర్దిచెప్పలేకనీవుసతమతమౌతుంటావు
అందరి నిందలు మోసే సహనానివి నువ్వేగా!
నీపనులకు సెలవులేదు నీసేవకు విలువలేదు
ఎదుగుటకై వాడుకునే నిశ్శ్రేణివి నువ్వేగా!
ఒక్కపూట గడవదమ్మ పడకేస్తే నువ్వింట్లో
నిన్నునీవు చూసుకోని త్యాగానివి నువ్వేగా!
చేయేతలగడకాగా కటికనేల పడకాయే
నిద్రించుటకేతీరని మహరాణివి నువ్వేగా !
నాల్గుపదుల వయసులోనె వడిలినపూవైనావే
అయినా పోడిమితగ్గని అందానివి నువ్వేగా!
ఆడదిలేనట్టియిల్లు అడవికన్న అధ్వానం
పైకిమేము అనకున్నా ప్రాణానివి నువ్వేగా !
-----------------------------
** పొన్నాడ మూర్తిగారి చిత్రానికి గజల్
( నిశ్శ్రేణివి = నిచ్చెనవి)

10, సెప్టెంబర్ 2016, శనివారం

ఓ చందమామ అందాల భామ - జయంమనదే - ఆపాత మధురాలు



ఈ పాట S.D.Burman గారు సంగీతం సమకూర్చిన 'జాల్' చిత్రంలో 'ye raat ye chandini' అనే పాటకి ఆధారం. హేమంత్ కుమార్ పాడిన ఆ పాట కూడా ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినండి. అయితే ఘంటసాల గారు ఆ పాటని తనదైన శైలి లో చాలా చక్కగా సంగీతం సమకూర్చి పాడారు. https://www.youtube.com/watch?v=4GfUK9Urb6I. జయంమనదే చిత్రం కూడా హిందీ చిత్రం 'బాదల్' కి ఆధారం. The Hindu దినపత్రిక 'జయం మనదే' పాటలు గురించి ఇలా అంటున్నారు. Though it was a remake, Ghantasala created original score. Kosaraju Raghavaiah Chowdhary wrote the popular numbers – ‘ veeragandham techhinamayaa …’ (Pithapuram Nageswara Rao and Jikki), ‘ Desabhakthi gala ayyallaraa… ’ (Ghantasala), ‘ Chilakanna chilakave …’ (Madhavapeddi Sathyam – Jikki) and ‘ Vasthundoy vasthundi… ’ (Ghantasala). Jamapana wrote the hit song, ‘ Kaluvala Raja katha vinaraavaa …’and Samudrala, ‘ Maruvajaalani manasuthalani …’ (Both rendered by P. Leela). Out of the nine songs in the album only one tune – ‘ O Chandamama…andaala bhaama ’ (lyric: Muddukrishna, singer: Ghantasala) has traces of influence of S.D. Burman’s ‘ Ye raat ye chandni phir kahan …’ from the film Jaal (1952).

5, సెప్టెంబర్ 2016, సోమవారం

వినాయకుడు - colour pencil work -


నేడు వినాయక చవితి. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మూడు సంవత్సరాల క్రితం రంగు పెన్సిళ్ళతో రూపొందించిన చిత్రం.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు ఓసారి మననం చేసుకుందాం.

ఎలుకగుర్రము మీద నీరేడు భువనాల పరువెత్తి వచ్చిన పందెకాడు 
ముల్లోకములనేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు.
“నల్లమామా” యనుచు నారాయణుని పరియాచకా లాడు మేనల్లు కుర్ర 
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోముపంట !
అమరులం దగ్రతాంబూల మందు మేటి ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వ్యాహ్యాళి వెడలివచ్చె ఆంధ్రవిద్యార్ది ! లెమ్ము జోహారులిడగ !!
లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు పసుపుగోచీకే సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు గరికపూజకే తలకాయ నొగ్గు
పంచాకల్యాణికై యల్కపాన్పు లేదు ఎలుక లత్తడికే బుజాలెగుర వైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు పచ్చి వడపప్పె తిను “వట్టి పిచ్చితండ్రి” !

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల 
ఇడుములం దించి కలుము లందించు చేయి; 
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి: 
భారతబిడ్డల భాగ్యాలు దిద్దుగాక !
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.

3, సెప్టెంబర్ 2016, శనివారం

అన్నమయ్య కీర్తన - నా colour pencil drawing.

నేను వేసిన రంగుల బొమ్మతో తాళ్ళపాక అన్నమాచార్య కీర్తన - facebook లో 'అన్నమయ్య - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య' గ్రూప్ వారు పోస్ట్ చేసుకున్నారు. వారికి నా ధన్యవాదాలు.

1, సెప్టెంబర్ 2016, గురువారం

ఎట్టా ఏగాలి మావా నీతో...అట్టా సెప్పమాకు నాతో..



ఎట్టా ఏగాలి మావా నీతో...అట్టా సెప్పమాకు నాతో.. .
ఏడు వారాల నగలెందుకు...ఏరు గాలి సాలంటావు
పట్టు సీర లెందుకు... లే త వొ ల్లు మోయదంటావు
సినిమాలకు రమ్మంటే ... పోకిరోళ్ల గోల లంటావు
సికారయినా పోదమంటే ..దుమ్ము దూళి అంటావు
పిల్లలొద్దు... జంట సరదాలకు అడ్దులు అంటావు
రోగమొస్తే... ఆసుపత్రులు చావు దారులు అంటావు
ఇరుగు పొరుగు కలిస్తే..కయ్యాలు షురువు అంటావు
సొంత గూడెందుకు...జాజి పందిరి ఉంది గా అంటావు
సోకులకు దండగెందుకు..సక్కదనాల సుక్కనంటావు
సంద మావ తోడుంటే.. సమురు దీపాలు వద్దంటావు
సూపులకు చుట్టాలొస్తే... ఇల్లు సుడి గొట్టు ద్దంటావు
సరుకులు తెమ్మంటే... పైసలు ఎక్కడివి అంటావు
ఆకలికి ఎలా అంటే.. .పేమ తిని బతికేద్దామంటావు
మల్లె పానుపు లొ ద్దు ..మంచె కాడ ముద్దులంటావు
కాయ కష్టం చెయ్యాలి అంటే..ఇష్టం చాలదా అంటావు
విసుగొచ్చి మారేదెప్పుడంటే...మరు జన్మకే అంటావు
ఎట్టా ఏగాలి మావా నీతో ..అట్టా సెప్పమాకు నాతో ....

(కవిత Courtesy : Devi Vangala garu on facebook)

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...