1, ఏప్రిల్ 2017, శనివారం

తప్పదులే - తెలుగు గజల్




నా చిత్రానికి scenic beauty ఇచ్చిన రాణీ రెడ్డి గారికి కృతజ్ఞతలు. 'తప్పదులే' 
గజల్ courtesy : శ్రీమతి Umadevi Prasadarao Jandhyala గారు.

ఎంతకూడ బెట్టిననూ వదిలిపోక తప్పదులే!
ఎంత వాన కురిసిననూ ఆగిపోక తప్పదులే !
మనసెందుకు ఇచ్చాడో ఈదేవుడు పగనుబూని
ఎంతకలిసి నడిచిననూ వీడిపోక తప్పదులే !
అందమైన భావాలకు ఊపిరూదె కవికలమే
స్వరముసరిగ కూర్చకున్న మాసిపోక తప్పదులే!
వలవిసిరిన జాలరులకు చేపలగిలగిల ఎరుకా ?
మోసగాళ్ళ గాలానికి చిక్కిపోక తప్పదులే !
ఉవ్వెత్తున లేచినఅల ఒడ్డుతాకి ఒరుగుతుంది
అహంకార మొకనాటికి తగ్గిపోక తప్పదులే !
చెట్టునపుట్టిన కాయలు చెట్టునకే ఉంటాయా
ఋణముతీర కాయమైన వాలిపోక తప్పదులే !


కామెంట్‌లు లేవు:

తెలుగమ్మాయి - గజల్

  మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా గజల్  రచన చల్లా రాంబాబు  పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి  అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి అచ్చతెల...