17, ఏప్రిల్ 2017, సోమవారం

సవరించిన అనురాగపు శ్రుతి మించని రాగములో - pencil sketch

సవరించిన అనురాగపు శ్రుతి మించని రాగములో
రుచి చూడని అమృతమును, చవి చూడని నీ గళములో.
సోయగాల నీ కన్నులలో వెలిగే వెన్నెల పువ్వై
వసివాడని నీ చిరునవ్వ్వులే ముత్తెముల తోరణాలై 
ఉప్పొంగిన భావనల అంతులేని నీ ప్రేమలో
అలలులాగా కరిగిపోతూ అంబుధిగ నే మారినాను.
వేకువలో నీ తలపే ఉషోదయపు రేఖలాగా
నా గమనపు దారిలో హాయినిచ్చే చిరుగాలి లాగ
ఇరు సందేల నీ ఊహే మెరిసే మింట చుక్కలాగా
వసివాడని నీ ప్రేమే నను నడిపించే శ్వాసలాగ .
కలవరమో కలికి తనమో ముసిరిన నీ మోమున
పలుకు లేక తెలుపునే నీ హృదయ భావమునే
నా ఆశల వినువీధిలో నిండు చందమామ నీవే
నీ పిలుపుల వెన్నెలకై వేచిన చకోరమే నేను
పి. గాయత్రిదేవి.
P. Pvr Murty gari picture

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...