15, ఏప్రిల్ 2017, శనివారం

కవితా స్పందన


నేను ఎప్పుడో వేసుకున్న రంగు పెన్సిళ్ళ చిత్రానికి facebook లో మిత్రులు శ్రీ రాజేందర్ గణపురం, శ్రీమతి జ్యోతి కంచి గార్ల  కవితా స్పందన. వారికి నా ధన్యవాదాలు.

ఔర
. ....
ముకుళం విరిసిన మందారం
ముగ్ద కోమల సుమహారం..!
మంజీర నాదాల రవలామృతం
మసకింటి రాయుని దీపితం..!
శ్రీదేవి విలసిత ముఖశోభితం
శింజానులమృదు శబ్ధ తరంగం.!
మలయజ వీచికల కూజితం
తొలకరి జల్లుల నాట్యవిలాసం.!
అపరంజి తళుకుల ఆడతనం
ఔర.! అంటోంది నా మానసం.!
.
.
.
రాజేందర్ గణపురం
. 14/ 04/ 2017


గజల్ సొగసరి-గడసరి॥ (శ్రీమతి జ్యోతి కంచి గారి గజల్)
~~~~~~~~~~~~~~
తలపులలో తొలివలపులు దాచెనులే నాచెలీ
వలపులతో బంధమేదొ వేసెనులే నాచెలీ!!
మురిపించే మువ్వలేవొ దాగెనులే నవ్వులలొ
నవ్వులతో నజరానా చిలికెనులే నాచెలీ!!
దోరసిగ్గు మొగ్గలన్ని విచ్చెనులే బుగ్గలలొ
బుగ్గలపై హరిచాపమె పొదివెనులే నాచెలీ!!
సయ్యాటల చిరుగాలే తూగెనులే కురులలో
కురులచాటు చూపొకటి విసిరెనులే నాచెలీ!!
అంబరమై ఆమెతళుకు విరిసెనులే సొగసులో
సొగసునీలి చీరచుట్టి మురిసెనులే నాచెలీ!!
తొలిజామున వాకిలిగా వేచెనులే నాజ్యోతి
తనరూపుతొ రంగవల్లి గీచెనులే నాచెలీ!! JK15-4-17

(చిత్రం-Pvr Murty బాబాయ్ గారు..ధన్యవాదాలు బాబాయ్ )

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...