నా రేఖా చిత్రానికి శ్రీమతి జ్యోతి కంచి అల్లిన చక్కని కవిత.
మదిభావం ॥నీవు-నేను॥
~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~
ఆశలలో కలిసుంటావా అన్నాను
నాశ్వాసల కలిమౌతానన్నావు..
నాశ్వాసల కలిమౌతానన్నావు..
ఆరాధన తెలుసా అన్నాను
ఏదైనా చేయగలను నీకోసం అన్నావు
ఏదైనా చేయగలను నీకోసం అన్నావు
ప్రేమించగలవా అనడిగాను
ప్రాణమవ్వగలను అన్నావు...
ప్రాణమవ్వగలను అన్నావు...
నాతోడుంటావా అన్నాను
నీడై దాచుకుంటానన్నావు
నీడై దాచుకుంటానన్నావు
గులాబిని నేను,ఎలాచూసుకుంటావ్ అన్నాను
తోటంతా నేనెై కాచుకుంటానన్నావు
తోటంతా నేనెై కాచుకుంటానన్నావు
నేనోడిపోతే?....
గెలుపై నడిపిస్తానన్నావు
గెలుపై నడిపిస్తానన్నావు
కన్నీరై జారే కనులకు....
కమ్మని కలనై వస్తానన్నావు
కమ్మని కలనై వస్తానన్నావు
నవ్వే వేళలో...
నా అధరాలై విరబూస్తానన్నావు
నా అధరాలై విరబూస్తానన్నావు
నాలోనేనై నిండేటప్పుడు....
చెక్కిలిచేరే చేయి నేనౌతానన్నావు
చెక్కిలిచేరే చేయి నేనౌతానన్నావు
నాకో జీవితమిస్తావా అన్నాను
నాలో జీవిస్తానన్నావు
నాలో జీవిస్తానన్నావు
నిజమే
"నీవు నిలుస్తూ
నన్ను గెలిపిస్తూనే వున్నావూ...
నా చిటికినవేలు "బంధపు"సాక్షిగా........
"నీవు నిలుస్తూ
నన్ను గెలిపిస్తూనే వున్నావూ...
నా చిటికినవేలు "బంధపు"సాక్షిగా........
J K 22-4-17
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు...ధన్యవాదాలు బాబాయ్ )
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు...ధన్యవాదాలు బాబాయ్ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి