2, జూన్ 2017, శుక్రవారం

నీ స్పర్శ కూడా భాషే




నా చిత్రానికి కవిత -  courtesy Jyothi Kanchi
మదిభావం ॥నీస్పర్శ కూడా భాషే॥
~~~~~~~~~~~~~~~~~~~~~
వెంటాడే తన స్పర్శ నానీడలో కలుస్తోంది
ఆహ్లాదమై నన్ను తాకే బంధమొకటి పెనవేస్తోంది!!
వెచ్చదనమా కాదది..బాధ్యతమోసే భరోసాతనం!!
నిరంతరం నేను నన్ను ఒంపుకునే నిండుదనం!!
నిన్నలలో నేనెవరో రేపైతే ఏమౌతానో
నీలిమబ్బులా చరించే జీవితమిది
ఏదిశకో చేరుకుంటూ చెదిరిపోతూ...
నీవొచ్చావు....
ఒద్దికగా మేఘమాలికలను ఏరికూర్చి,నన్నో వానచినుకును చేసావు
అవధులులేని అక్షరవిహంగాలివిగో ఇలా వలసవచ్చేసాయి
కొల్లేటితీరమై నేను,, నాలోనిండిన ప్రతిరేణువై నీవు !!
చెంపతాకిన చల్లగాలి..యుగళగీతాలేవీ పాడడంలేదు
పెదవిపైన మనప్రణయరాగాలసలే లేవు
జతవీడని బంధమై చివరివరకు నాచేతిలో నీచేయి
 నీ స్పర్శ కూడా భాషై మధురంగా వుంటోంది..
నీచేతి వేళ్ళతాకిడికే మరో రోజు బతకాలనివుంది...
ఒక్కటి చెప్పనా సఖుడా!!
మృత్యుంజయమంత్రమే.....మన బంధం!!
JK 2-6-17(చిత్రం--Pvr Murty బాబాయ్ గారూ....ధన్యవాదాలు బాబాయ్ )

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...