మల్లాది రామకృష్ట్న శాస్త్రి - పెన్సిల్ చిత్రం.
తన కలం బలంతో తెలుగు సినిమా పాటలో తేనెలూరించారు మల్లాది రామకృష్ణశాస్త్రి... నేడు మల్లాది వారి జయంతి ... ఈ సందర్బంగా రామకృష్ణశాస్త్రి కవితామాధుర్యాన్ని మననం చేసుకుందాం...
మల్లాది రామకృష్ణ శాస్త్రి మాటే మధురం... ఆ మాట పాటగా మారితే అది మరింత మధురం కాక ఏమవుతుంది... చలనచిత్రసీమలో అడుగు పెట్టక ముందే తెలుగునేలపై మల్లాది రామకృష్ణశాస్త్రి రచనలు తెలుగులోని తీయదనాన్ని మరింత చేసి చూపించాయి... ఆయన కలం పలికించే మాధుర్యం కోసం తెలుగు చిత్రసీమ ఎర్రతివాచీ పరచింది... చిత్రసీమ పులకించేలా మల్లాదివారి కలం సాగింది... మధురాతి మధురాన్ని తెలుగువారికి సొంతం చేసింది... గురజాడ 'కన్యాశుల్కం' తెరరూపంలోనూ మల్లాదివారి పాట మరింత పసందుగా సాగి గిరీశం పాత్రకు సినిమా తళుకులద్దింది...
కథ ఏదయినా అందుకు అనువుగా తన కలాన్ని కదిలించడం మల్లాదివారికి బలేగా తెలుసు... అందుకే ఆయన రాసినవి కొన్ని పాటలే అయినా, అన్నిటా తనదైన బాణీ పలికించారు... ఇతరులను అనుకరించడం ఆయనకు తెలియని విద్య, ఇతరులు తనను అనుసరించేలా చేసుకోవడంలో ఆయన మిన్న... రాసి కన్నా వాసిమిన్న అని నమ్మి తెలుగు జిలుగులు కనిపించేలా మల్లాదివారి కవితాయాత్ర సాగింది... మల్లాది వారి పలుకులోని మాధుర్యం ఈ తరం వారిని సైతం ఆకర్షిస్తూనే ఉంది... ఒక్కసారి మల్లాది పాట వింటే చాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది...అదీ మల్లాది పాటలోని మహిమ!...
మద్రాసులో సముద్రాల రాఘవాచార్యకు అత్యంత ఆప్తుడయ్యాడు. అతడికి చాలా కాలం "ఘోస్ట్ రైటర్"గా ఉన్నాడు. 1952 వరకు ఇతడు చేసిన సినిమా రచనలలో ఇతని పేరు లేకపోవడం గమనార్హం. చిన్న కోడలు చిత్రంతో ఇతడు అజ్ఞాత వాసం వదిలి బహిరంగంగా సినీజీవితం కొనసాగించాడు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రచించాడు. చిరంజీవులు, రేచుక్క, కన్యాశుల్కం, జయభేరి లో సూపర్ హిట్ అయిన పాటలు ఇతడు రచించినవే !
ఆంధ్ర సారస్వత క్షేతంలో పసిడి పంటలు పండించిన పుంభావ సరస్వతి కే.శే. మల్లాది రామకృష్ట్న శాస్త్రి.
(సేకరణ - ఇక్కడా అక్కడా)
ETV వారు ప్రసారం చేసే స్వరాభిషేకం కార్యక్రమం లో నేను వేసిన మల్లాది వారి చిత్రాన్ని చూపించడం గమనార్హం. అయితీ ఈ కార్యక్రమం ద్వారా కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు.
- పొన్నాడ మూర్తి
1 కామెంట్:
పుంభావ సరస్వతిని మళ్ళీ ఈరోజు స్మరించుకొని అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి