స్థానం నరసింహారావు (My pencil sketch)
నివాళి - స్థానం నరసింహారావు (సెప్టెంబర్ 23, 1902 - ఫిబ్రవరి 21, 1971) ప్రసిద్ధ
రంగస్థల మరియు తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక
స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో
సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక
నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని
చూరగొన్నాడు. శృంగార
రసాన్ని ప్రతిబింబించే
రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా,
వీరరసాన్ని చిత్రించడంలో
రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా,
ప్రణయదేవతగా, భక్తురాలిగా,
దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా
నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు
వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో
మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని
మంత్రముగ్ధుల్ని
చేశేవాడు.
వీరు సినీ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని
సినిమాలలో నటించాడు. తన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని
ఆయన రచించాడు. ( ఈ నెల 'తెలుగుతల్లి
కెనడా' పత్రిక లో ఈ చిత్రం ముద్రించబడింది. సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు).
ఎవ్వాని స్థానమ్ము నెవ్వారు
పూరింప
లేనట్టి స్థానమ్ము
నెక్కినారు
ఎవ్వాని స్త్రీపాత్ర లెవ్వరు
చూపంగ
దరిజేర లేనట్టి
దారి మీది
ఎవ్వారు మిమ్ముల నెరుగంగఁ
గలరు స్త్రీ
పాత్రనందున్నచో పత్ని గూడ
ఎవ్వారు నవరస హృదయంగ మాద్భుత
నటసార్వ భౌములు నయన మోహ
వారె నరసింహరావులు వరలె ధరణిఁ
మధుర వాణిచిం తామణి మంత్ర ముగ్ధ
రోష నారగా పోషించె
లోకమందు
బిరుదు లెన్నియొ దరిజేరె
ప్రీతితోడ. (Sri TBS Sarma)
)ప్రఖ్యాతిఁబొందెను రంగస్థలమునను,
చలనచిత్రములను శాశ్వతముగ
స్త్రీపాత్ర ధారణఁజేసి మెప్పింపగా
స్థానము వారికి సాటిలేరు
సత్యభామాదుల చక్కని పాత్రలన్
పోషించి మెప్పును
బొందియుండ్రి
నటకౌశలమ్ముచే నరసింహరావును
వలచి పద్మశ్రీయు
వచ్చె దరికి
ప్రేక్షకాభిమానమ్మును పెద్దగాను
చూరగొనిరి స్థానమువారు శోభితముగ
రావుగారు నటస్థాన రచనఁజేసి
తన యనుభవముల్ తెల్పిరి
దానియందు
2)స్త్రీపాత్రలందున శృంగార రసమును
సత్యభామ యగుచు చక్కగాను
ప్రణయపాత్రలను చిత్రాంగి యగుచు,రోష
నార పాత్రంబున
వీరరసము
ప్రణయదేవతయైన,భక్తురాలైనను
దేవదేవియునైన,దేనినైన
మధురమైనట్టి యా మధురవాణియునైన
పాత్ర యేదైనను
ప్రతిభ మెఱయ
నవరసంబు లొలకఁబోసి నటనయందు
చీరకట్టు సొగసులందు చెలువమొప్పి
మంత్రముగ్ధులఁజేయుచు మహిమఁజూపి
రహిని పొందిరి నరసింహరావుగారు (Smt. Kannepalli Varalakshmi)