16, ఫిబ్రవరి 2020, ఆదివారం

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి







మధునాపంతుల వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. తెలుగు జాతి చరిత్రకుపెద్దబాల శిక్షవంటిదైన మహాకవి ఆంధ్ర పురాణము.. అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణం అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.

సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అని పురాణమును పంచలక్షణాత్మకంగా వర్ణించారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రచించినఆంధ్ర పురాణం’, ప్రాచీన అష్టాదశ పురాణాల సరసనవంశాను చరితంలక్షణానుసారంగా నిలుస్తుంది. సంస్కృత పంచమహాకావ్యాలు, తెలుగు పంచమహాకావ్యాలు అందరికీ తెల్సినవే. కొంతకాలం క్రితం హైదరాబాద్లో ఆధునికపంచ మహాకావ్యాలుఅనే శీర్షికతోఆంధ్రపురాణంపై ప్రసంగంతో సహాఉపన్యాస లహరినిర్వహించారు.

1947కు ముందు భావ కవిత్వోద్యమకాలంలో గడియారం శేషశాస్త్రి, రాజశేఖర శతావధానిప్రబంధములు రాయడం యుగధర్మమేనా? ఉంటే ఇందలి రాణా ప్రతాపసింహుడు, గాంధీ, నేతాజీ, శివాజీలకు ప్రతీకలు. అలాగే స్వరాజ్యాన్ని, సురాజ్యంగా మార్చుకునే నిమిత్తం వీరభద్రమూర్తివందేమాతరంమధునాపంతుల వారిఆంధ్రపురాణంఅవతరించాయి. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి సాత్త్వికులు. కవిత్వ రచనలో, అక్షర రమ్యతలోలోనారసికులుఅనునట్లు రచించిన శిల్పం ఆకళింపు చేసుకొన్నవారు రాజమహేంద్రవరంలో ఉన్నప్పటికీ వీరు తిక్కనశైలిని బాగా అధ్యయనం చేశారు. నానా రుచిరార్థ సూక్తితో తాను నేర్చిన భంగి చెప్పి వరణీయుడైనాడు. మధుకోశము’ (తేనెపట్టు)లో ప్రధానమైనదిఆంధ్రపురాణం’. ఇది నవఖండ భూమండలాకృతి. నవధృరాసుకృతి. ఐతరేయబ్రాహ్మణము నాటి చరిత్రతో మొదలుపెట్టి, శాతవాహన కాకతీయ, విజయనగర, తంజావూరు, ఆంధ్రసామ్రాజ్య వైభవమును కావ్యగానం చేశారు. 1950 దశకంలో తొలిసారి రచించబడి ఎన్నోసార్లు పునర్ముద్రణకు నోచిన గ్రంథము తెలుగు జాతి చరిత్రకుపెద్దబాల శిక్షవంటిది.

శ్రీకారంబును జుట్టినాడ కృతినాశీర్వాదము సేయుమమ్ము కామేశ్వరీఅంటూ ఇలవేల్పును స్మరించి, ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం వేలుపులను స్తుతిస్తూ సమస్త భూ మండలాన్ని స్తుతించారు. హరిశ్చంద్రుని కాలం నాటి చరిత్రను గుర్తు చేశారు. రుద్రమదేవి పౌరుషానికి నీరాజనం పలికారు.. శ్రీకృష్ణ దేవరాయలకు అక్షరాభిషేకం చేశారు. విజయనగర సామ్రాజ్యం అంతరించాక దక్షిణాంధ్ర యుగం ప్రారంభమైనది.

విజయనగర రాజ్య విభవంబు పూచిన పూలలో రెండింటిని తునిమి కొప్పునందు తురుముకొనుచూ తెలుగుపడతి సింహావలోకనము చేసుకున్నది అనే అందమైన భావంతో...’ మధునాపంతులవారి భావుకత అవగతమవుతున్నది. వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. వీరి ఆంధ్రపురాణము, అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణము అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.
శ్రీవాణీ గిరిజాశ్చరాయ... అంటూ నన్నయ్య వేయి సంవత్సరాల క్రితం కావ్యరచన చేసిన ప్రదేశంలోనే వీరు రచన చేయడం యాదృచ్ఛికమే అయినా సాహితీ ప్రియులచే అభినవ నన్నయ్యగా కీర్తించబడే రచన చేసిన ఘనులు మధునాపంతులవారు.

ఆంధ్ర రచయితలు, శ్రీఖండం, తోరణాలు, బోధివృక్షం వంటి పద్యకావ్యాలు కల్యాణతార (నవల) ‘మధునాపంతుల వ్యాసాలువంటి వ్యాస సంపుటాలను వెలువరించి, ‘కథా పుష్కరిణిపేరిట కథా సంపుటులను రచించి త్రివిక్రములుగా పద్య, గద్య, నవల రంగాలలో తనదైన శైలిలో తెలుగు భారతిని అర్చించారు. ‘ఆంధ్రకుటీరంపేరిట సాహితీ విద్యాలయం ద్వారా తెలుగు భాషా బోధన, ‘ఆంధ్రసాహిత్య పత్రిక ద్వారా తెలుగు కవులెందరికో వేదికను కల్పించారు. రాజమహేంద్రవరంలో వీరేశలింగం పంతులు ఆస్తిక ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాలు ఆచార్యులుగా సేవలందించారు. ‘ఆంధ్ర కల్హణ’, ‘అభినవ నన్నయ్య’, ‘కళా ప్రపూర్ణబిరుదులతో సాహితీ లోకం వీరిని సత్కరించింది. 72 ఏళ్ల వయస్సులో 1992లో నవంబర్‌ 7 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శివైక్యం చెందారు. (సేకరణ : ఇక్కడా అక్కడా)
(వివరాలు March 5, 2019 ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)

15 Feb. 2019 నాడు విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో వీరి శతజయంతి సమాలోచన సభ జరిగింది. 'తెలుగు రథం' నిర్వాహకులు శ్రీ కొంపెల్ల శర్మ గారి అభ్యర్ధన మేరకు నాకు మధునాపంతుల వారి చిత్రాన్ని చిత్రీకరించే అదృష్టం కలిగింది. 




సభ వివరాలు శ్రీమతి వసుధారాణి గారి సౌజన్యంతో :

"శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి"శతజయంతిని పురస్కరించుకుని వారి సాహిత్యంపై "తెలుగురథం" హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం పౌరగ్రంథాలయం లో జరిగిన సమాలోచన సదస్సు ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది.
శ్రీ చింతకింద శ్రీనివాసరావు అధ్యక్షోపన్యాసం చక్కని పద్యంతో మొదలుపెట్టి మధునాపంతుల వారి సాహితీ వైభవాన్ని తెలిపే విధంగా వివరణలతో కొనసాగింది.
శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు మధునాపంతుల వారితో కల అనుబంధాన్ని తెలిపారు.శ్రీ రాంభొట్ల నృసింహ శర్మ మధునాపంతుల వారి పద్యాలలో దేశభక్తి అన్న విషయముపై అతి చక్కని పద్యాలుగానం చేసి సభను ఓ స్థాయికి తీసుకువెళ్లారు.శ్రీ కాండూరి శ్రీరామచంద్రమూర్తి గారు మధునాపంతుల వారి సరస సాహిత్యం గూర్చి వారి సరస సంభాషణలను గూర్చి ఆద్యంతం ఆసక్తిగా వివరించారు.శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి (సంచాలకులు ఆంధ్రీ కుటీరం) వారు 1992 నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు.
మధునాపంతుల వారి కుమారులు మధునామూర్తిగారు దేశవ్యాప్తంగా గత ఏడాది మార్చ్ 5 వ తేదీనుంచి ఇప్పటివరకూ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సభలు 30 వరకూ జరిపినట్లు తెలిపారు.
కొంపెల్ల శర్మ గారు సభలో అందరి చేత తెలుగు భాషా వికాసం పట్ల బద్ధులమై ఉంటామనే "తెలుగు భాషా ప్రతిజ్ఞ" ను చేయించి 2008 నుంచి "తెలుగురథం" తెలుగుభాషా వికాసానికి,పరిరక్షణకు చేస్తున్న కృషిని తెలిపారు.
విశాఖసంసృతి వ్యవస్థాపకులు సన్యాసిరావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.
సోదరులు కొంపెల్ల శర్మగారి నిబద్ధత,సభను నిర్వహించడంలో కల క్రమశిక్షణ అభినందనీయం.ఓ చక్కని సాహితీ వారసత్వం మన తెలుగు వారికి ఉంది అని గర్వం కలిగించి, బాధ్యతను కూడా గుర్తుచేసిన కార్యక్రమం.




కామెంట్‌లు లేవు:

Woman in rural A quiet journey through the fields

A quiet journey through the fields  (My created picture of rural India)  This picture captures a moment from rural India that is slowly fadi...