22, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రేమమనసు తెలిపిందా బెదరిపోయి ఎపుడైనా! కంటిచెలమ దాగిందా పొంగిపోయి ఎపుడైనా! - తెలుగు గజల్






నా చిత్రానికి చక్కని గజల్ రచించిన శ్రీమతి పద్మజ చెంగల్వల గారికి, వాటిని అద్భుతంగా సమీక్షించిన హంసగీతి గారికి, శ్రీ శ్రీనివాసరావు మంత్రప్రగడ గారికి నా ధన్యవాదాలు.
  
ముషాయిరా గజల్ సమీక్షతో కూడి..

..గజల్..
ప్రేమమనసు తెలిపిందా బెదరిపోయి ఎపుడైనా!
కంటిచెలమ దాగిందా పొంగిపోయి ఎపుడైనా!
అడిగిచూడు నిలువరించె గుండెకోత గాయాలను
జీవితమే గెలిచిందా ఓడిపోయి ఎపుడైనా!
కనులదాగు కలలన్నీ కంచిదారి పట్టలేవు
చెలిమిగూడె కూడిందా వీగిపోయి ఎపుడైనా!
గాలివాటు జీవితాన శూన్యమదే నిండిపోవ
ప్రణయతంతి మ్రోగేనా మురిసిపోయి ఎపుడైనా!
నింగినంట కడలికేల ఎడతెగనీ ఆరాటం
నింగిరేడు దాగేనా బెదరిపోయి ఎపుడైనా!
మావిచిగురు వెగటుపుట్టి, అలిగేనా కోయిలమ్మ
వసంతుడే నిదురోయెన మరచిపోయి ఎపుడైనా!
జనజీవన స్రవంతిలో నిన్నలేదు నేడుముగిసె
రేపటి ఆశలు వీగున విసిగిపోయి ఎపుడైనా!!

 హంసగీతి గారి సమీక్ష
పేరు లోను ఇంటి పేరు లోను కలువపూల చల్లదనం పదము పలికితే భావ పరిమళం చిందించే కవనం గజల్ వ్రాస్తే సున్నితమైన భావాలు పలికిస్తూ కొత్త కొత్త పదబంధ సొగసులతో అలరించే పద్మజ చెంగల్వల గారి గజల్ సమీక్ష చేయటం కొలనులో కలువపూలను చూస్తే ఎంత హ్లాదమొందుతామొ అంతగ భావ సుగంధాలను ఆస్వాదించామనిపిస్తుంది
అంతులేని ప్రేమను గుండెలోనే దాచుకున్న మనసు ఏ బెదిరింపులకు లొంగదు తన ప్రేమను తన మనసులోనే దాచుకుంటుంది ఇక ఆ ప్రేమ తెలపలేని మనసు ఉబికి వస్తున్న కన్నీటిని మాత్రం ఆపలేదు .. మనస్సుకు హత్తుకునేలా ఉన్న మత్లా అద్భుతంగా ఉంది ఇక ఒకో కలువపూవు చిందించిన భావపరిమళం ఆస్వాదించండి
 - అడుగు వేయకుండా నిలువరించే గుండెకోత గాయాలు జీవితంలో తప్పవెవరికైన. గాయపడి కుములుతున్న జీవితం ఓడిపోయి గెలవడం కష్టమేగా .. నిజం
కధలు కంచికెళ్ళినట్టు కనుల దాగిన కలలు కూడా కంచిదారి పట్టవుకదా రెప్పలోనే దాగిపోతాయి లేదా అసలు గురుతు కూడా ఉండవు కొన్ని .ఇక వీగిపోయిన చెలిమి చేరువౌతుందనే నమ్మకం ఉండదూ ! చక్కని షేరు
 కొన్ని జీవితాలు గాలివాటుకు కొట్టుపోయే గాలిపటంలా ఏ దరికి చేరతాయో తెలియదెపుడూ అటువంటి జీవితాల్లో ఆనందం ఉండదు ఇక ప్రేమతంత్రులు మోగుతాయా ? కన్నీటీ చుక్కలు రాలతాయి అంతే .వెరీ టచ్చింగ్ షేరు
సంద్రంలోని అలలకెపుడూ నింగినంటాలని ఉబలాటం కానీ ఆ కెరటాలకు భయపడి చంద్రుడు దాగాడా ఎపుడైనా బ్యూటిఫుల్ షేరు.
 వసంతుడు తన రాకను మరిచిపోయి ఆపడెప్పుడు అలాగే లేత మావి చిగురు తిన్న కోకిలమ్మకు ఎప్పుడైనా ఆ చిగురంటే తీపే కదా !!
ఇక చివరి గా మక్తాలో జీవితం గడిచిన నిన్న ఉండదు ఈరోజూ గడుస్తూ ముగిసి పోతుంది కాని ఏదో సాధించాలనే రేపటి ఆశలు ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటాయి .అని ఆశే మనిషికి జీవితమని నిన్నా మొన్నా జ్ఞాపకాల గురుతులతో గడపబోయే జీవితం పై ఎన్నో జీవిత గమనాన్ని నిర్థేశిస్తాయని భావన చక్కని స్ఫూర్తిదాయక షేరు ..
జీవితంలో ఒడిదుడుకులను పేర్కొంటూ నిత్య సత్యాలను ఉటకిస్తూ అద్భుతమైన గజల్ వ్రాసిన పద్మజ చెంగల్వల గారి కి అభినందనలు తెలియచేస్తూ మరెన్నో మంచి గజల్స్ మనకు అందించాలని కోరుకుంటున్నాను .

మిత్రులు శ్రీనివాసరావు మంత్రిప్రగడ గారి సమీక్ష ః


" Hope is the lode star of progress "
' Hope ' is the  anchor of life '
Despite setbacks in life, it (life) presses on further to realise the taste of the Nectar of life.

Life is a repetitive process. Every turn of the day, it always tries to find newness in life and yearns to reach what is unreachable.... So wisely the observed facts and experienced anecdotes in life have been so concisely capsuled here to touch everyone's heart. It really takes us to experience the events of life along with the author of the Gajal here. The author is successful here to touch the tender chord of everyone's heart. It makes to ponder over those referred ones time and again.
Well composed, Madam.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...