18, ఫిబ్రవరి 2020, మంగళవారం

కాకులు




పద్యానికి చిత్రం -- చిత్రానికి పద్యాలు :
కాకులు
మిత్రులు ప్రసాద్ కవుటూరు గారి పద్యానికి నా చిత్రం.
పితృదేవతలకు పిండప్రదానం చేసే సమయంలో, చనిపోయినవారి వారసులు, బంధుమిత్రులు కాకుల రాకకోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో కాకులు ఏమనుకుంటున్నాయో అన్న ఆలోచన కలిగిన సందర్భంలో ఒక పద్యం వీక్షించండి.
కాకుల గోల యంచు పలుగాకులు మమ్ముల గెలీసేతు రీ
కాకుల రాకకై కనులు కాయలు కాయగ రుద్ర భూమిలో
పాకముచేసి పిండములు,భక్షణ సేయగ రండటంచు మా
కాకి కులంబు మిత్రులకు గాలము వేతు రదేమి చిత్రమో
-----------------------------------------------------------------------
నా చిత్రానికి మిత్రుల పద్యాలు Courtesy : Whatsapp group
అనంత ఛందము - ఛంద శ్శిక్షణ
Dr. H. Varalakshmi
పెద్దల తిథులను మరచిరి
తద్దిన దినము బలిభుక్కు తహతహ వెదుకన్
పెద్దలు మిగిలిరి మావలె
సుద్దులు జెప్పగ దిగులున సుతులకు నేడున్
----------------------------------------------------------------------
Smt. Syamala Rudraraju
కాకము నీచ జన్మమును గాంచిన నేమి యథేచ్ఛగా భయో
ద్రేక మడంగ నిత్యమును దీనత నిన్నది 'కావు కావు' మం
చో కమలాయతాక్ష! సుగుణోన్నతి వేఁడదె? యోమి కర్మమో
నాకు భజింపఁగానిను మనంబది సాధ్యము కాదు రాఘవా!

(రాఘవా! కాకి హీనమైన జన్మ పొందితే నేమి? తన ఇష్టాను సారంగ తన యొక్క భయము, ఉద్రేకము తొలగించుకోవాలన్న తపన తో ప్రతి నిత్యము నిన్నది కావుము కావుము(కావు, కావు) అనుచు సుగుణముట్టి పడే విధంగా వేడుకుంటోంది. 
ఓ కమలముల వంటి కనులు గల వాడా(రామా) అదేమి కర్మమో గాని నాకు నిన్ను కాకి లాగా ( కావు, కావు అని) భజించడానికి సాధ్యము కావడం లేదు.

ఇదండి నా భావన. విచక్షణా జ్ఞానం లేకపోయినప్పట్టికీ కాకి యొక్క అరుపులో అంటే కావు కావు మనడంలో నన్ను కాపాడు అనే అర్థం ధ్వనిస్తోంది. మనిషినై పుట్టి ప్రతి అంశము నా ప్రతాపమని నేనే దేనినైనా పరిష్కరించుకోగలనన్న అహంకారముతో నిన్ను వేడుకోవడం లేదు రామా!)

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...