22, నవంబర్ 2020, ఆదివారం

కలకంఠి దోసిటన ఇమిడింది ఒకజంట - గజల్



శ్రీమతి గుడుపూడి రాధికారాణి గారి గజల్ యథాతధంగా.  ఆమె అనుమతితో నా చిత్రాన్ని జోడించుకున్నాను.


 *గజల్*

కలకంఠి దోసిటన ఇమిడింది ఒకజంట
అలవంటి వెన్నెలతొ తడిసింది ఒకజంట
మదిలోని మూర్తిని మహిళయే చూపింది
తనరూపు జతచేయ వెలిసింది ఒకజంట
నిశివేళ శశిరాక ఊరటను కలిగించు
కిరణాల ధారలో మురిసింది ఒకజంట
అడ్డంకులెన్నున్న అధిగమించును అతివ
జాబిల్లి సాక్షిగా మెరిసింది ఒకజంట
అనురాగమాశించి నీ నీడ నిలిచింది
పులకించి నృత్యమే ఆడింది ఒకజంట
అందాల అపరంజి అవనికే అద్భుతము
మమతయే కుసుమమై విరిసింది ఒకజంట
వలపువీణలు మోగ పాడవే రాధికా!
బతుకంత పున్నమిగ గడిపింది ఒకజంట.
********************************
గుడిపూడి రాధికారాణి(1.07.2018)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మంచి రచన. చదువుతుంటే ఒక చక్కని పాత సినిమాపాట జ్ఞాపకం వచ్చింది. దాంట్లోని కొంత భాగం..

మ్రోగింపవే హృదయ వీణ
పలికింపవే మధుర ప్రేమ

సతిపతులను విరజాజి పూవుల
ప్రేమ తావియై పరిమళింపగ
హృదయభారమును తీర్చి దంపతుల
మనసులనొకటిగా మార్చును ప్రేమ.

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...