30, నవంబర్ 2020, సోమవారం

ఓం నమశ్శివాయ - పద్య స్పందన

నా రేఖా చిత్రానికి మిత్రుల పద్య స్పందన

మత్తేభం.

కనువిందై కనుపించుచుండె కనగన్ కార్తీక దీపోత్సవం

బు!నదీకాంతుని దేవళంబున నహా! పూర్ణంబుగా దివ్వెలుం

!నభంబందున తారకావళివలెన్ చక్కంగ గాన్పించ చే 

తనమే బొందితి నేడుపున్నమని చంద్రాచూడుకిష్టంబుగా

మనసే జిందులువేసె సంతసమునన్ మధ్భాగ్యమై యొప్పదే

యనుకోకుండగ నంజలించితిని నే నాదివ్వెలశ్రేణికిన్!

Mvvs Sastry.

 

ఆటవెలది

శిరము పైన గంగ నురుగులు గ్రక్కంగ

నొడలు మీద బూదె తడిమి నంత

మంచు కొండ పైన మించిన తెలుపులో

శ్వేత వర్ణు డనగ శివుడు వెలిగె !

దేశినేని 11510 Desineni Ramarao

 

పద్మాసనమున కూర్చుని

పద్మాక్షుని చింతజేయ పరమేశ్వరుడున్

పద్మాయత లోచనుడును

పద్మాయత లోచనమున భవునర్చించెన్!!

పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

 

కం.

నీలాకాశము నంటెడు

కాలాత్ముడ కార్తికాన కరుణను జూపన్

హాలాహల గళ ధారీ

ఫాలాక్షుడ మమ్ము బ్రోవ ప్రణతులు గొనుమా

(Venkateswara Prasad)

 

 


 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...