26, నవంబర్ 2020, గురువారం

ప్రఖ్యాత నృత్యాంగన 'హెలెన్'


 ప్రఖ్యాత నృత్యాంగన 'హెలెన్'

pencil drawing


హెలెన్ జైరాజ్ రిచర్డ్‌సన్ హిందీ సినిమాలలో నటించిన నటీమణి, నర్తకీమణి. ఈమె తండ్రి ఆంగ్లో ఇండియన్. ఆర్మీలో పనిచేశాడు. తల్లి బర్మాదేశస్థురాలు. నర్సుగా పనిచేసింది. హెలెన్ 1939నవంబర్ 21న బర్మాలో జన్మించింది. ఈమె తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించాడు. బర్మాపై జపాన్ దండెత్తిన సందర్భంలో 1942లో ఈమె కుటుంబం భారతదేశానికి కాందిశీకులుగా వలస వచ్చింది. తన తల్లి సంపాదన కుటుంబపోషణకు సరిపోక పోవడంతో ఈమె చదువు కొనసాగించలేకపోయింది. 'కుకూ ' అనే ఒక నర్తకి, నటి ద్వారా  1951లో ఈమె సినిమారంగానికి పరిచయమైంది. ప్రప్రధమంగా రాజ్ కపూర్ నిర్మించిన 'ఆవారా' చిత్రంలో ఓ కోరస్ డ్యాన్స్ లొ కనిపించింది. 'హొరా బ్రిడ్జ్' చిత్రంలో 'మెర్రా నాం చిమ్ చిమ్ చూ' అనే నృత్యం ఓ రికార్డ్.  ఇంక ఆమెకు వెనుదిరిగి చూసుకునే అవసరమే రాలేదు.  . ఈమె 700లకు పైగా చిత్రాలలో నటించింది. ఈమె 1981లో హిందీ చిత్ర రచయిత సలీంఖాన్‌ను వివాహం చేసుకుంది. ప్రఖ్యాత హిందీ సినిమా హీరో సల్మాన్ ఖాన్‌కు ఈమె సవతి తల్లి. ఈమె జీవితాన్ని ఆధారం చేసుకుని నాలుగు సినిమాలు, ఒక పుస్తకం వెలువడింది. ఈమె హిందీ సినిమాలతో పాటు దక్షిణాది భాషా చిత్రాలలో కూడా నాట్యం చేసింది. ఈమెకు 1999లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 2009లో భారత ప్రభుత్వం వారిచే పద్మశ్రీ పురస్కారం లభించాయి.

'సంతోషం'  'భూకైలాస్' వంటి తెలుగు చిత్రాలలో కూడా ఈమె నృత్యం చేసింది.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...