27, మార్చి 2026, శుక్రవారం

​నిశ్శబ్దపు మేఘం


 ​నిశ్శబ్దపు మేఘం 


​ అప్పుడప్పుడు ఆకాశం నిండా

 మబ్బులు పట్టినట్టు,

 మనసంతా ఏదో దిగులు కమ్మేస్తుంది..


నొప్పించే ఏ చిన్న భావన

మదిలో మెదిలినా...

ఆలోచనలు చుట్టూముట్టి 

అచేతనంగా మార్చేస్తాయి...


 ఆవహించిన దిగులు మేఘం వెనకాల 

 ఓ చిన్న యుద్ధమే జరుగుతుంది..

 అందుకే చిరునవ్వులు చిందాల్సిన పెదవులు

మౌనాన్ని కట్టబెట్టుకుంటాయి ..


కాసింత సమయమే...

నిశ్శబ్దపు మేఘం కరిగి.. 

చిరుజల్లు కురిపించగానే

మళ్ళీ విరిసిన మందారమై 

 దరహాసాలు విరబూయదా..!!


అనూశ్రీ 


(నా చిత్రానికి ఆత్మీయ మిత్రురాలు రచించిన కవిత)


​

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...