28, మార్చి 2026, శనివారం

క్షన్నులు కన్నులు కలుపుతూ - గజల్


 గజల్

 ✍️గుడిపూడి రాధికారాణి


కన్నులకన్నులు కలుపుతు కానుకలందుకోవడం పండగే కదా!

నేనే బహుమతినంటూ వస్తే నవ్వుకోవడం పండగే కదా!  


నవ్వులపువ్వులు రాలని వేళన సందడుండునా?

బావా రావా అంటూనే బతిమాలుకోవడం పండగేకదా!  


రవ్వలహారం కొంటానంటే మురిపెము చూపే భామను కానోయ్

నామెడచుట్టూ చేతులువేస్తే మురుసుకోవడం పండగే కదా!


అరిసెలు బూరెలు గారెలు జంతిక విస్తరినున్నా విందు ముగియదోయ్ 

చిలకలు చుట్టిన నాచేతులనే చేరుకోవడం పండగే కదా!


మల్లెలు జాజులు పరిమళభరితపు కుసుమాలంటే నమ్మను బావా 

చూపులతూపులు తాకగ తావిని నింపుకోవడం పండగే కదా!


సాగరతీరపు సరదాషికారు చాలనిపించదు ఎందుకు బావా?

కలిపిన అడుగులు కెరటము దాచగ ఆడుకోవడం పండగే కదా!


బావను మించిన ఇంద్రజాలికుడు లేడని చెప్పగ సంశయమేలోయ్

తెల్లని బుగ్గలు ఎర్రని కెంపులనద్దుకోవడం పండగే కదా!


నా చిత్రానికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి గుడుపూడి రాధికా రాణి రచన )

కామెంట్‌లు లేవు:

క్షన్నులు కన్నులు కలుపుతూ - గజల్

 గజల్  ✍️గుడిపూడి రాధికారాణి కన్నులకన్నులు కలుపుతు కానుకలందుకోవడం పండగే కదా! నేనే బహుమతినంటూ వస్తే నవ్వుకోవడం పండగే కదా!   నవ్వులపువ్వులు రా...