అద్భుత సంగీత దర్శకుడు 'చిత్రగుప్త' (1917-1991. (Pencil sketch).
21, జూన్ 2021, సోమవారం
అద్భుత సంగీత దర్శకుడు 'చిత్రగుప్త'
అద్భుత సంగీత దర్శకుడు 'చిత్రగుప్త' (1917-1991. (Pencil sketch).
13, జూన్ 2021, ఆదివారం
బుచ్చి బాబు (రచయిత)
ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. వీరు రచించిన 'చివరకు మిగిలేది" నవలా సాహిత్యం లో ఓ సంచలనం. తెలుగులో వచ్చిన 'చివరకు మిగిలేది' సినిమా వీరి నవల ఆధారంగా తీసిన సినిమా అని కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారు.. ఈ సినిమా బెంగాలీలో నిర్మించిన 'దీప్ జలే జాయ్' చిత్రంగా ఆధారంగా తీసారు. (pencil sketch)
"నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తిత్వం ఏర్పడి యీ బాధని ఇతరులతో చెప్పుగుని విముక్తుడవుతాడు. ఆ సంఘర్షణ నిలిచి, ద్వంద వ్యక్తిత్వానికి సమన్వయం కుదిరి, ఏకత్వం సాధించినవాడు అతను యోగి - ఇంక వ్రాయడు. ఈ గొడవ విని, యీ బాధని పంచుకోడానికి సిద్ధపడే పాఠకులు ఏ వొకరిద్దరో వుంటారేమో. ఒక్కడు వున్నా ఆ కథకుడు ప్రయోజనం సాధించి చరితార్ధుడైనట్లే భావిస్తాను."
7, జూన్ 2021, సోమవారం
ఖ్య్వాజా అహ్మద్ అబ్బాస్ - చరిత్ర సృష్టించిన రచయిత
ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ - my pencil sketch
His column ‘Last Page’ holds the distinction of being one of the longest-running columns in the history of Indian journalism. The column began in 1935, in The Bombay Chronicle, and moved to the Blitz after the Chronicle's closure, where it continued until his death in 1987. He was awarded the Padma Shri by the Government of India in 1969.
6, జూన్ 2021, ఆదివారం
రాముడిదె లోకాభిరాముడు - అన్నమయ్య కీర్తన
అన్నమయ్య కీర్తనకి నా చిత్రాలు (బాపు బొమ్మలు ఆధారంగా వేసుకున్న చిత్రాలివి)
రాముడిదె లోకాభిరాముడితడు
5, జూన్ 2021, శనివారం
కధానిలయం కధానాయకుడు - కాళీపట్నం రామారావు
కాళీపట్నం రామారావు - నా pencil drawing
చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో ఓ కథాతపప్వి సాహితీ సేవకు ప్రతిరూపంగా శ్రీకాకుళం లో ఓ కథానిలయం ఏర్పడింది. కథల కాణాచి కారా మాష్టారు మానసపుత్రికగా.... ఎక్కడెక్కడో విచ్చుకున్న కథా పుష్పాలన్నింటినీ సేకరిస్తూ 'కథా నిలయం' అన్న పేరుకే సార్థకత చేకూరుస్తూ ముందుకు సాగుతోంది.
దానవ సంహా రమునకు మానుష రూపంబునెత్త మాధవు డిలపై వానికి తోడుగ రుద్రుడు వానర రూపం బునొందె వాయుసుతుండై !
దానవ సంహా రమునకు
మానుష రూపంబునెత్త మాధవు డిలపై
వానికి తోడుగ రుద్రుడు
వానర రూపం బునొందె వాయుసుతుండై !
2)ఉ॥
పట్టగ సూర్యునే దలచి పండుగ మారుతి పోవుచుండగన్
కొట్టెను నేమిచే హయుడు కూనని యెంచక హన్వుదాకగన్
తిట్టుచు వాయుదేవుడును తెమ్మెర నిల్పగ నెల్లలోకముల్
తుట్టున కోర్వలేక పరితోషణ నొందగ దీర్చిరర్థముల్ !
(నేమి - వజ్రాయుధం
తుట్టు- బాధ
పరితోషణ - సంతోషము)
3)సీ||
లంఘించి సంద్రమున్ లాఘవంబున,లంక
జేరి గన్గొనెకదా సీతజాడ !
మెప్పించు మాటలన్ మైధిలి శోకంబు
నుడిపియొసగెరాము నుంగరంబు ‘!
కుప్పించి యెగురుచు గూల్చెను వనమంత
రావణునకెరిగింప రాక తనది !
దండింప నుంకింప దగ్ధంబు గావించె
కపివీరుడననేమొ గనుల బడగ !
ఆ.వె॥
చేరి రాఘ వునకు చింతామణినియిచ్చె
సీత జాడ దెలిపి చింతదీర్చె
బంటు రీతి గొల్చి పవరము జరిపించె
స్వామి హత్తు కొనగ సంతసించె !
4)తే.గీ ।।
అసమ బలశాలి యంజన యాత్మ భవుడ!
సకల సద్గుణ వంతుడ! శౌర్యధనుడ!
స్వర్ణ దేహుడ! సుగ్రీవ సచివ హనుమ !
రామభక్తాగ్ర గణ్యుడా రక్ష నీవె !
5)ఉ॥మాలిక
వాలము ద్రిప్పి పైకెగిరి వార్థిని దాటిన వాయుపుత్ర నీ
వాలము జుట్టిగుండ్రముగ ప్రస్తరణంబున నిల్చిరావణున్
‘ఆలము జేయగా దగదు యారఘు రామునితో’ననంగ, పో
గాలము దాపురింప దశకంఠుడు మెచ్చడు నీదు మాటలన్
చేలము జుట్టివాలమున చిచ్చును బెట్టగ నూరుకుందువే
ఫాలుడ వైననీవపుడు పావకు డొందగ బ్రీతిఁజేయవే !
కూలగ జేసినావుగద గుండెన ధైర్యము దైత్యనాథుకున్ !
6)తే.గీ
జ్ఞాన పరిపూర్ణ హనుమంత జయము నీకు !
వాయుపుత్రుడ!భయహారి! భక్త సులభ !
గదను బట్టిన నీధాటి కెదురుగలదె !
దనుజ సంహారి! బ్రోవుమా దయతొ మమ్ము !
7)కం॥
గ్రహపీడదొల్గ జేసెడి
మహిమాన్వితుడైనవాడు మారుతి యనగన్
రహియింప జేయ భక్తుల
వహియించునువానిభరము భక్తసు లభుడై
8)కం॥
భయవిహ్వలులైనప్పుడు
భయమును పోగొట్టియాత్మ బలమునొసంగున్
జయమునకు తగిన శక్తిని
రయమున చేకూర్చుహనుమ ప్రస్తుతి సేయన్ !
9)సింధువు దాటిన వానికి
సింధూరమునిష్టపడెడి చిద్రూపునకున్
డెందముననిలిపి రాముని
యందరికాదర్శమైన యనిలజు దలతున్ !
10)
నేడు పీడించు రాక్షసిన్ నేలగూల్చ
ననిల తనయుని గొల్చెద నార్తితోడ
బ్రోవరావయ్య జగతిని మ్రుచ్చునుండి
నేటి వేడుక గుర్తుగ నింపు శుభము !
—————-
చిత్రం
శ్రీ Pvr Murty గారిది. వారికి కృతజ్ఞతలు
3, జూన్ 2021, గురువారం
శ్రీరంగం గోపాలరత్నం
ధన్యవాదాలు.
నెల్లూరు నగరాజారావు - ప్రముఖ రంగస్థలం నటులు
చిత్రీకరణ : పొన్నాడ మూర్తి ★★★★★★★★★★★★★★★ 💥 తెలుగునాటకరంగ వైభవం💥 ★★★★★★★★★★★★★★★ ఈనాటి మన చిరస్మరణీయులు.. శ్రీ నెల్లూరు నగరా...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...







