7, ఆగస్టు 2016, ఆదివారం

కృష్ట్నా పుష్కరాలు



*పుష్కర ప్రాశస్త్యం:*
**** ********** ************ ****
బృహస్పతి గ్రహం నవగ్రహాల్లో ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది భూమికంటే పెద్దదిగా ఉంటుంది. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణకులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహంతో మానవులకు ఎంతో ఉపకారం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. అంతేకాదు!
ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవం తులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని జ్యోతి శ్శాస్త్రం చెబుతోంది. అలాగే, గురుగహ్ర ప్రభావం భూమ్మీద నివసించే వారిపై ఎక్కువగా ఉంటుందని కూడా ఈ శాస్త్రం స్పష్టం చేస్తోంది. అలాంటి ఈ బృహస్పతి మనకున్న పన్నెండు రాశుల్లోనూ ఏడాదికో రాశిచొప్పున సంచరిస్తూ పన్నెండేళ్లూ పన్నెండూ రాశుల్లోనూ సంచరిస్తాడు. ఈ సంవత్సరం ఆగస్ట్ 12 వ తేదీ నుండి గురు గ్రహం కన్యా రాశి లో ప్రవేశం తో కృష్ణా నది కి పుష్కరం ప్రారంభం.
ఈ సమయంలో ముక్కోటి దేవతలు నదిలో నివాసమై ఉంటారు. దాంతో ఆయా నదులకు ఎంతో ప్రాభవం, ప్రభావం ఉంటుంది. ఈ సమయం లో ఒక్కసారి స్నానం చేస్తే పన్నెండేళ్లపాటు ప్రతిరోజూ నదీ స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారని పురాణాలు ఘోషిన్నాయి
“గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.
నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.
అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.
భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.
ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.
కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.
మన ప్రభుత్వం వారు ఈ కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసినారు.. మనం కూడా భాద్యత తో క్రమశిక్షణ తో పుష్కర స్నానం ఆచరించి, పితృ దేవతల రుణం తీర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ శతమానంభవతి

(Courtesy : Sri Venugopal Nellutla)

1 కామెంట్‌:

vahini చెప్పారు...

బాగా వివరించారు

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...