6, ఏప్రిల్ 2018, శుక్రవారం

పంచభూతాల దాడి = కవిత


నా పెన్సిల్ చిత్రానికి మిత్రురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి కవిత

పంచభూతాల దాడి
కన్నీటికుండలు
ఎన్ని కుమ్మరించినా
మనసు అగాథం లోని
బాధల బడబాగ్ని
చల్లారటం లేదు.
అపార్థాల భూకంపాలు
ప్రేమ పునాదుల్ని కదిల్చి
అనుబంధాల మేడల్ని
కుప్పకూలుస్తున్నాయి
కనురెప్పల వాకిళ్ళు
ఎంత గట్టిగా బిగించినా
తోసుకొచ్చే సుడిగాలిలా
అలజడి దొంగ
అంతరంగంలో జొరబడి
నిద్రను కాజేస్తున్నాడు
అనంతమనుకున్న
ప్రేమకాశం
శూన్యమని
నెత్తిన పిడుగుపడ్డాకే అర్థమయ్యింది
గుండెను మండిస్తున్న
నిజమనే నిప్పు
ఆత్మశాంతి వనాలను
దావానలంలా‌ దహిస్తోంది.
పంచభూతాలు
పంచప్రాణాలపై పగబట్టి
తమలో ఐక్యం చేసుకోవాలని
ఆరాటపడుతున్నాయి.
మరి
ఈ పోరాటంలో
విజయం
ప్రకృతికో!
ప్రాణాలకో!!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
sam చెప్పారు...

dear sir very good blog and very good content
http://www.suryaa.com/38648-high-security-at-uppal-for-ipl-matches.html

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...