31, జులై 2018, మంగళవారం

కనులు



నేను చిత్రించిన ఈ 'కనులు' చిత్రానికి faceook లో  తమ కవితలతో స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.


వినీలాకాశంలో ఇంద్రధనుస్సుని చూస్తూ అచ్చెరువొందిన కనులు
కొండలనడుమ ఉదయిస్తున్న బాలభాస్కరునిని దర్శించి తరించిన కనులు
ఎగసిపడే కెరటాల విన్యాసాలాకి పులకరించిన కనులు
అరవిరసిన పూబాలల వింతవింత సోయగాలకి మైమరచిన కనులు 
ఆలయంలో పరమాత్ముని దివ్యమంగళ దర్శనంతో అరమోడ్పులైన కనులు
పసిపిల్లల ముగ్ధత్వానికి పరవశించిన కనులు
కొండలలో, కోనలలో, ఏరులలో సెలయేరులలో ప్రకృతికాంత
అందాలకి దివ్యానుభూతి చెందిన కనులు ..
కంటిచూపు కరవై ఈ ఆనందానుభూతులకి దూరమైన కబోది ని చూసి
దుఃఖాశ్రువులతో నిండెను నా కనులు ..
అప్పుడు .. అప్పుడనిపించింది నాకు .. నా కనులతో ఆ అభాగ్యుడు
ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలని!
ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాయి నా కనులు. 


చెలి! కనురెప్పలు
. ‌.... ..............---- పొన్నాడ లక్ష్మి
.
సీ॥కొనగోట కాటుకఁ । కొసరి కొసరి యింతి
కనురెప్పలకు దిద్ది । కాంతు లద్ది
దోరనవ్వును నవ్వి । నోరచూపును రువ్వి
మూసి కందెఱలతో । బాస లాడు
చెలికాని స్వరములై । తొలి సంధ్య వెలుగులై
మధుర తోరణమయి । యెదురు చూచు
ఇరుల పూ దోటలో । వరుని చే దోటలో
అరమోడ్పు నయనాల । అరువు లిచ్చు
ఆ॥చెలియల కనురెప్ప । తొలి రాయబారమై
వచ్చి పలుక రించి । ముచ్చ టించు
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం
. 30/ 07/ 2018
కందెఱ = కనురెప్ప
..Pvt Murthy.. గారు స్వహస్తాలతో.. గీసిన చిత్రం చూసి నే వ్రాసిన పద్యం..!

1 కామెంట్‌:

Raajee's raajeeyam చెప్పారు...

కలువ కళ్ళ నయని చూపుల బాణాలు ఎవరిపైన విసురుతుందో..
ఆ కంటి కొసలలో ఎవరి మనసు చిక్కుకుందో..
అరమోడ్పు కన్నుల మీనాక్షికి నేత్రానందం ఎవరిని చూస్తున్నాందుకో..
కాటుక లద్దింది ఎవరి ఊపిరి ఉసురు తీసేందుకో..
నైస్ పైంటింగ్ సర్..

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...