10, జులై 2020, శుక్రవారం

పీసపాటి నరసింహమూర్తి - రంగస్థల నటులు




అద్భుత రంగస్థల నటుడు కీ. శే. పీసపాటి నరసింహమూర్తి గారు, నా pencil sketch.

నా చిన్నప్పుడు వీరి నాటకాన్ని తిలకించే భాగ్యం కలిగింది. కీ. శే. పొన్నాడ కుమార్, మా చిన్నాన్న గారు మంచి రంగస్థల నటులు. వీరిద్దరూ కలిసి నటించిన నాటకం అది.

వీరి శత జయంతి సందర్భంగా మిత్రులు శ్రీ కొంపల్లి శర్మ గారు youtube channel లో ఈ రోజు సమాలోచన సభ ఏర్పాటు చేసారు. అమ్మాయి గిరిజ పీసపాటి 'నటనావతంస పీసపాటి' పేరుతో facebook లో ఓ గ్రూపు కూడా ఏర్పాటు చేసింది.

పీసపాటి వారి గొప్పతనాన్నిచెప్తూ ప్రముఖ కవి, తెలుగు భాషా ప్రేమికులు శ్రీ మీగడ రామలింగస్వామి గారు రచించిన పద్యం. 'నటనావసంతం పీసపాటి' గ్రూపు సౌజన్యంతో ..


సీ ।।శ్రీకృష్ణ పాత్రకు చేతనత్వమునిచ్చి
జనుల మెప్పును గొన్న ఘనత మీది !
బాహుక పాత్రకే భవ్య యశమ్మిచ్చి
ప్రజల మన్నన గొన్న ప్రతిభ మీది !
నక్షత్ర పాత్రకు నవ్యత చూపించి
గొప్పను వడసిన మెప్పు మీది !
సత్య హరిశ్చంద్ర సద్యశమ్మంతయు
కొండంత చాటిన గొప్ప మీది!

గీ।। సాహితీ భావ నటన సంస్కార మద్ది
పద్య నాటక రంగాన ప్రథితులౌచు
అరయ నరసింహ మూర్తులై వరలినట్టి
పీసపాటి మహోదయా ! వేల నుతులు!
- మీగడ

శ్రీ రామలింగస్వామి గారు తనకు పీసపాటి వారి తో గల అనుబంధాన్ని కూడా ఇలాగ వివరించారు :


వారు నన్ను ఎంతో ప్రేమించేవారు .
1 . పై పాత్రలన్నీ
వారు నటించగా నేను చూశాను .
2. వారి నక్షత్రక పాత్రకు సుమారు పది సార్లు నేను హార్మోనియం కూడా వాయించాను .
3. గయోపాఖ్యానం నేను కృష్ణుడు
వారు అర్జునుడు గా వేశాం .
4 . నా శ్రీకాళహస్తీశ్వర మాహాత్మం నాటకం ఓ చోట చూసి వారి ఊరు రాముడు వలస లో ఏర్పాటు చేసి సతీ సమేతంగా చూసి
ఘన సమ్మానం చేసి
5 *****స్వదస్తూరితో కతపత్రాన్ని ఇచ్చారు .
6 . మరొక్క మాట చెప్పాలి .
వీటన్నిటికీ ముందు మా ఇద్దరం సాహిత్య నాటక విషయాలపై లోతుగా చర్చించుకున్నాం అనే కన్నా వాదులాడుకున్నాం .
వారు నన్ను పరీక్షించ డానికే అలా చేశారని నేను భావిస్తుంటాను .
వారికి సవినయాంజలితో
——-డా మీగడ







Comment


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...